ఎస్ ప్రెసెంట్ అందరూ ఇదే కామెంట్స్ తో రచ్చ రంబోలా లేపుతున్నారు. రష్మిక మందన్నా పేరు ఈ మధ్యకాలంలో ఎలా వైరల్ అయిపోయిందో మనం చూసాం . ఓ రేంజ్ లో చెప్పాలంటే ఇండస్ట్రీలో తోపైన హీరోయిన్ ఆమె అనుకున్నారు . అటు టాలీవుడ్ ఇటు బాలీవుడ్ మధ్యలో కోలీవుడ్ మూడు ఇండస్ట్రీలనీ మిక్సీలో వేసి గిరగిరా తిప్పేసింది. పాన్ ఇండియా హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకుంది .
మరీ ముఖ్యంగా యానిమల్ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది . బోల్డ్ బ్యూటీ అంటూ ట్యాగ్ చేయించుకుంది . ఇక రష్మిక తప్పిస్తే ఇండస్ట్రీలో తోపైన హీరోయిన్ ఎవరూ లేరు అంటూ మాట్లాడుకునే స్థాయికి వెళ్ళిపోయింది . సీన్ కట్ చేస్తే ఒకే ఒక్క సినిమాతో శృతిహాసన్ ఆ అంచనాలు అన్ని బెడిసి కొట్టేలా చేసింది. సలార్ సినిమాలో హీరోయిన్గా నటించిన శృతిహాసన్ చాలా నెమ్మది గానే బిహేవ్ చేసింది . ఎక్కడ కూడా నేను పెద్ద తోపు హీరోయిన్ అనేలా బిహేవ్ చేయలేదు. మరీ ముఖ్యంగా ప్రభాస్ లాంటి స్టార్ హీరోతో నటించిన హీరోయిన్ శృతిహాసన్ ఇంత సైలెంట్ గా ఉండడం అందరికీ ఆశ్చర్యకరంగా అనిపించింది.
అయితే చాలామంది రష్మిక కన్నా శృతిహాసన్ బెటర్ అంటున్నారు. రష్మిక హెడ్ వెయిట్ ఎక్కువ అని ఓవర్గా బిహేవ్ చేస్తుంది అని.. సినిమా ప్రమోషన్స్ కోసం మరింత స్థాయిలో ఎక్స్పోజ్ చేస్తుందని ..కానీ శృతిహాసన్ పూర్తిగా డిఫరెంట్ అని.. పర్సనల్గా తాను ఎంత ఎక్స్పోజ్ చేసిన శృతిహాసన్ సినిమా పరంగా మాత్రం కమిటెడ్ గా ఉంటుంది అని సలార్ లాంటి హిట్ సినిమాలో నటించిన ఇంకా ఎంత సైలెంట్ గా ఉంది.. అదే ప్లేస్ లో రష్మిక ఉంటే మాత్రం రచ్చ రంబోలా చేసేదని చెప్పుకొస్తున్నారు . అంతేకాదు బాలీవుడ్ లో రెండు బడా సినిమాలలో రష్మిక చేయాల్సిన పాత్రను దొబ్బేసింది శృతిహాసన్ అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం రష్మిక కెరియర్ కొంచెం అయోమయంలో పడినట్లే అంటున్నారు సినీ విశ్లేషకులు. ఓవైపు శ్రీ లీల మరోవైపు శృతిహాసన్ రష్మిక కు బాగానే చుక్కలు చూపిస్తున్నారు..!