ఆ స్టార్ హీరోయిన్ లాగా ఫీలవుతున్న కార్తీకదీపం వంటలక్క… నీకు అంత లేదు అంటూ సీరియస్…!

తెలుగు బుల్లితెర సీరియల్స్ తో ఎంతోమంది పాపులారిటీని దక్కించుకుంటూ ఉంటారు. అందులో ఒకరు ప్రేమి విశ్వనాథ్. కార్తీకదీపం సీరియల్ లో వంటలక్క అనే పాత్రలో నటించి మంచి పేరు ప్రఖ్యాతలు పొందింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈమెకి ఫాలోయింగ్ కూడా ఏమాత్రం తక్కువ ఉండదు.

ఇక ఈమె తెలుగు నటి కాకపోయినప్పటికీ రెండూ తెలుగు రాష్ట్రాలలో విపరీతమైన అభిమానులని దక్కించుకుంది. వంటలక్క పాత్రలో ఎంతో అద్భుతంగా నటించినటువంటి ఈమె.. కార్తీకదీపం అనంతరం తిరిగి ఏ తెలుగు సీరియల్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకి రాలేదు.

అయినప్పటికీ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులతో తన పర్సనల్ విషయాలను పంచుకుంటుంది. ఇక ఈ క్రమంలోనే తాజాగా ఈమె సీనియర్ యాక్టర్ మహానటి లాగా తయారయ్యి ఓ వీడియో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియోను చూసిన ప్రేక్షకులు అసభ్యకరంగా కామెంట్స్ చేస్తున్నారు.