రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా మారడానికి కారణం అతడేనా.. ఇన్నాళ్లకు రివిల్ అయిన సీక్రెట్..

మెగాస్టార్ కొడుకుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ అతి తక్కువ టైంలోనే గ్లోబల్ స్టార్ గా పాపులారిటీ దక్కించుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది సంపాదించుకున్న చెర్రీ మొదట్లో ఎన్నో విమర్శలను చూశాడు. కొన్ని సందర్భాల్లో వరుస ఫ్లాప్‌ల‌తో స‌త‌మ‌త మైన‌ రామ్ చరణ్ ఎవరెన్ని విమర్శలు చేసిన ప్రతి ఒకరికి తన నటనతో సమాధానం చెబుతూ వచ్చాడు. రంగస్థలం ముందు వరకు ఆయనకి యాక్టింగ్ రాదు అంటూ ఎంతో మంది రైటర్లు ఓపెన్ గానే ఫేస్ పై కామెంట్ చేశారు. అలా వారు చేసిన కామెంట్స్ ని తిప్పికొడుతూ రంగస్థలం తర్వాత నుంచి రామ్ చరణ్ తన యాక్టింగ్ పవర్ ను చూపించాడు.

ఈ సినిమా తర్వాత నుంచి రామ్ చరణ్ క్రేజీ ఏవిధంగా పెరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక రంగస్థలం ముందు టాలీవుడ్ లో ఓ ప్రముఖ రైటర్ రామ్ చరణ్ కు అసలు యాక్టింగే రాదని తండ్రి చిరంజీవి అండతోనే సినిమా అవకాశాలను దక్కించుకుంటూ నటిస్తున్నాడని విమర్శలు చేశాడు. దానికి చిరంజీవి తమ్ముడు నాగబాబు కూడా కౌంటర్ ఇచ్చాడు. ఈ రైటర్ మనో విజ్ఞానికి సంబంధించిన ఎన్నో పుస్తకాలను రాశాడు. అవి చాలా పాపులార్ అయ్యాయి. అయితే ఈ సీనియర్ రైటర్ చరణ్ పై చేసిన విమర్శలే ఆయన్ను మరింత రాటు తెల్చాయ‌ట‌.

నటనలో మేలుకువ‌లు నేర్చుకున్ని ఎలాగైనా నటనలో తన సత్తా చూపించాలనే చెర్రీ ఎంతో క‌ష్ట‌ప‌డాడ‌ట‌. ఇక‌ రంగస్థలం సినిమాలో తన నట విశ్వరూపాన్ని చూపించాడు. ఇక సినిమాలో చెర్రీ యాక్టింగ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక తర్వాత వచ్చిన పాన్ ఇండియా మూవీ ఆర్‌ఆర్ఆర్ సినిమాతో మరో అడుగు ముందుకు వేసిన చెర్రీ విమర్శకులతో కూడా ప్రశంసలు అందుకున్నాడు. ఈ సినిమాతో గ్లోబల్ స్టార్ గా క్రేజ్ సంపాదించుకున్నాడు. రామ్ చరణ్ ని చూసి చాలా నేర్చుకోవాలి అనేంతలా చర్రీ తననితాను మౌల్డ్ చేసుకున్నాడు. ప్రస్తుతం రామ్ చ‌ర‌ణ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్‌ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.