ఫస్ట్ డే కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్న ‘ సలార్ ‘.. ఎన్ని కోట్లో కొట్టిందో తెలిస్తే ఫ్యీజులు ఎగిరిపోతాయ్‌..!

పాన్ ఇండియ‌న్‌ స్టార్ హీరో ప్రభాస్ తాజాగా స‌లార్‌ సినిమాతో ప్రేక్షకుల‌ముందుకి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్ – ప్రభాస్ కాంబినేషన్‌లో తెర‌కెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులను షేక్‌ చేస్తోంది. రిలీజ్ కి ముందున్న హైప్‌కి పాజిటివ్ టాక్ కూడా తోడవడంతో సినిమా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ కలెక్షన్లను రాబడుతుంది. ఇక‌ సినిమాకు వచ్చిన హైప్‌ ని బట్టి ట్రేడ్ వర్గాలు రూ.150 నుంచి రూ.200 కోట్లు ఓపెనింగ్స్ ని రాబట్టేలా సలార్‌ మూవీ క్రేజ్ ఉందంటూ అంచనాలు వేశాయి.

ఇదే జరిగితే 2023 డే 1 హైయెస్ట్ ఓపెనింగ్ డే కలెక్షన్స్ విషయంలో ప్రభాస్ కొత్త రికార్డును క్రియేట్ చేయడం ఖాయం అని వివరించింది. తక్కువలో తక్కువ రూ.150 కోట్ల ఓపెనింగ్స్ ని రాబట్టిన కూడా సలార్ సినిమా 2023 హైయెస్ట్ ఓపెనింగ్ డే గ్రాసర్ అవుతుంది. కాగా ఈ ఏడాదిలో ఇండియన్ సినిమా దగ్గర హైయెస్ట్ ఓపెనర్‌గా చాలా సినిమాలు నిలిచాయి. లియో, జవాన్ లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలనాల సృష్టించాయి.

మరి వీటిని క్రాస్‌ చేసి ఆల్ టైం బిగ్గెస్ట్ గ్రాస‌ర్‌గాగ సలార్ నిలిచినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సలార్‌ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా రూ.165 కోట్లకు పైగా గ్రాస్‌వ‌సూళ్ళు వచ్చినట్లు తెలుస్తుంది. ఖ‌చ్చితంగా ఈ రేంజ్‌లో గ్రాస్ వచ్చినట్లయితే 2023 లో హైయెస్ట్ గ్రసర్‌గా సలార్ నిలవడం పక్కా. అయితే మేకర్స్ పక్కాగా ఎంత వచ్చిందో అఫీషియల్ గా అనౌన్స్ చేస్తే గాని ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు.