పేరు మార్చుకున్న రైతుబిడ్డ… అసలు కారణం ఇదే…!

బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. కామన్ మ్యాన్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రశాంత్.. తన ఆట తీరుతో అందరిని మెప్పించి ట్రోఫీని గెలుచుకున్నాడు. ఇక ఈయన ఫ్యాన్స్ చేసిన హడావిడి కి పల్లవి ప్రశాంత్ ని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక బెయిల్ మీద బయటకి రాబోతున్నాడట పల్లవి ప్రశాంత్.

ఇదిలా ఉంటే బిగ్ బాస్ స్టేజ్ లోకి అడుగుపెట్టిన తర్వాత ఈయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో పెరిగిందో ఈయన ఇన్స్టా చూస్తే తెలుస్తుంది. ప్రస్తుతం ఫాలోవర్స్ 1M పైగానే ఉన్నారు. ఇక తాజాగా ఇన్స్టాలో పల్లవి ప్రశాంత్ తన పేరు, బయో చేంజ్ చేశాడు.

” Malla vachina, SPY team winner ” గా అంటూ తనని తాను ప్రకటించుకున్నాడు. ఇక దీనిపై స్పందించిన అభిమానులు…” రైతు బిడ్డ మోస్ట్ జెన్యూన్ పర్సన్. తనకు సపోర్ట్ గా నిలిచిన శివాజీ, యావర్లను ఎప్పటికీ గుర్తుంచుకుంటాడు ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.