బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ఇటీవల వచ్చిన ఢంకీ సినిమాతో పాన్ ఇండియా లెవెల్‌లో మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం షారుఖ్ ఖాన్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌కు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. షారుఖ్‌ను మరోసారి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ బాక్స్ ఆఫీస్ దగ్గర దెబ్బ కొట్టాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఐదేళ్ల క్రితం ప్రశాంత్ నీల్ కేజిఎఫ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన టైంలో కూడా షారుక్ ఖాన్ నటించిన ఓ సినిమా బాక్స్ ఆఫీస్ నుంచి కనుమరుగయ్యింది. ఇప్పుడు సలార్ సినిమాతో మరోసారి షారుక్ సినిమాకు ప్రశాంత్ దెబ్బ గట్టిగానే పడింది. ఢంకీ వర్సస్ సలార్ లో ఢంకీ మునిగిపోయినట్లే కనిపిస్తోంది.
ఇప్పుడు ఎక్కడ చూసినా సలార్ పేరే వినపడుతుంది. బాహుబలి తర్వాత ఆ రేంజ్ లో హిట్ ప్రభాస్ కు మళ్ళీ సెలార్ తోనే వచ్చింది. సాహో, రాధేశ్యామ్, ఆది పురుష్ లాంటి హ్యాట్రిక్ హిట్‌ల తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమా.. అది కూడా కేజిఎఫ్ సిరీస్‌ల డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించడంతో సినిమాపై రిలీజ్ కు ముందు నుంచే భారీ అంచనాలను నెలకొన్నాయి. అంచనాలకు తగ్గట్టుగానే సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ టాక్ అందుకుంది. మొదటినుంచి సలార్ వర్సెస్ ఢంకీ వార్ మొదలైనట్లు వార్తలు తెగ వినిపించాయి. అయితే ఒక రోజు గ్యాప్‌తో ఈ రెండు సినిమాలు రావడం.. అది కూడా పాన్ ఇండియా లెవెల్ క్రేజ్ దక్కించుకున్న హీరోల సినిమాలు కావడంతో.. సినిమాలపై ప్రేక్షకుల్లో కూడా మంచి ఆసక్తి నెలకొంది.
ఇక ఇప్పుడు సలార్ సినిమా పాజిటివ్ టాక్ రావడం అలాగే ఢంకీకి మిక్స్డ్ టాక్ రావడంతో ఢంకీ భారీ నష్టం జరిగే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. ఇక గతంలోనూ సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కేజిఎఫ్ సినిమాను రిలీజ్ చేసిన నేపథ్యంలో అప్పుడే షారుఖ్ ఖాన్ జీరో సినిమా రిలీజ్ అయింది. ఇక ఆ టైంలో ప్రశాంత్ నీల్‌కు సినిమాతో వచ్చిన షారుక్ జీరో సినిమాకు భారీ నష్టం మిగిలింది. ఇప్పుడు మళ్ళీ అదే సీన్ రిపీట్ అయ్యేలా కనిపించడంతో.. ప్రశాంత్ నీల్, షారుక్ సినిమాను మరోసారి దెబ్బ కొట్టన్నాడని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే షారుక్ ఖాన్ పై పగ పట్టినట్లు ఏంటి భయ్యా మరి ఇలా షారుక్ సినిమాలకే వరుసగా దెబ్బ వేస్తున్నావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.