” సలార్ ఫ్లాప్ అనుకున్న.. కానీ హిట్ అయింది “… నటి సెన్సేషనల్ కామెంట్స్..!

పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో.. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన మాస్ ఎంటర్టైనర్ మూవీ ” సలార్ “. నిన్న రిలీజ్ అయిన ఈ మూవీ థియేటర్ల వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఈ మూవీ అనుకోనంత సక్సెస్ కావడంతో ప్రభాస్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇకపోతే తాజాగా ఈ మూవీ గురించి బిగ్ బాస్ కంటెస్టెంట్ గీతు రాయల్ షాకింగ్ కామెంట్స్ చేసింది.

ఈ సందర్భంగా ఈమె రివ్యూ ఇస్తూ…” సలార్ మూవీ ఫ్లాప్ అవుతుందని నేను అనుకున్నాను. ఈ మూవీ కూడా ఫ్లాపేనా అని నేను ఫీల్ అయ్యాను. ఇక దీంతో బెనిఫిట్ షోకే వెళ్లి సినిమా చూశాను. ఈ మూవీలో ప్రభాస్ లుక్ అదిరిపోయింది. కానీ ఈ మూవీ నాకు అర్థం కాలేదు.

ఇందులో వచ్చే ఫైట్ సీన్స్ అలాగే ట్విస్టులు నాకు అస్సలు అర్థం కాలేదు. నాకు బుర్ర తక్కువ ఉండడంతో ఈ సినిమా అర్థం కాలేదేమో తెలీదు. కానీ ఒకసారి చూస్తే సినిమా అర్థం కాదని.. ఈ సినిమా అర్థం కావాలి అంటే మరోసారి కూడా చూడాలి ” అంటూ కామెంట్ చేసింది గీతూ. ప్రస్తుతం ఈమె కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.