2023లో చిన్న సినిమాలుగా రిలీజై.. బ్టాక్ బాస్ట‌ర్ హిట్లుగా నిలిచిన సినిమాలు ఇవే..

ప్రతి ఏడాది చిన్నచిన్న సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అవుతూనే ఉంటాయి. కొన్ని సినిమాలు సక్సెస్ కాగా మరికొన్ని సినిమాలు కనుమరుగైపోతాయి. అయితే ఈ ఏడాది కూడా అదే విధంగా చిన్న సినిమాలుగా బాక్సాఫీస్ దగ్గర రిలీజైన కొన్ని సినిమాలు భారీ బ్లాక్ బస్టర్ హిట్లుగా అదిక‌ లాభాలను గడించాయి. ఇంతకీ అలా అతి తక్కువ బడ్జెట్ తో రిలీజై భారీ లాభాలను తెచ్చి పెట్టిన ఆ సినిమాల లిస్టు ఏంటో ఇప్పుడు చూద్దాం.

బలగం:


కమెడియన్ వేణు డైరెక్టర్గా ఎంట్రీ ఇచ్చిన మూవీ బలగం. కేవలం రూ.3 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత రూ.25 కోట్ల గ్రాస్ వ‌సూళ్ళ‌ను కొల్లగొట్టి చిన్న సినిమాల్లో భారీ సక్సెస్‌ అందుకున్న మూవీల లిస్టులో చేరిపోయింది. ఈ సినిమాకు ఎంతమంది సినీ ప్రముఖుల ప్రశంసలు కూడా దక్కాయి.

బేబీ:


ప్రముఖ యూట్యూబర్‌ వైష్ణవి చైతన్య హీరోయిన్గా ఆనంద్ దేవరకొండ హీరోగా తరకెక్కిన మూవీ బేబీ. సాయి రాజేష్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఊహించని రేంజ్‌లో సక్సెస్ అందుకుంది. రూ.10 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ.80 కోట్ల గ్రాస్ వ‌సూళ‌ను కల్లగొట్టి ప్రొడ్యూసర్లకు కాసుల వర్షం కురిపించింది.

సామజ వరగమన


హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీ విష్ణు హీరోగా నటించాడు. కేవలం రూ.7 కోట్ల బడ్జెట్లో రిలీజైన‌ ఈ సినిమా రూ.50 కోట్ల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టి మంచి సక్సెస్ అందుకుంది.

మ్యాడ్ :


జూనియర్ ఎన్టీఆర్ బామ్మర్ది నార్ని నితిన్ కీల‌క పార్త‌లో నటించిన మూవీ మ్యాడ్‌. కాలేజ్ లైఫ్, కాలేజ్ ఎంజాయ్మెంట్‌ను కళ్ళకు కట్టినట్లుగా ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమా కూడా అతి తక్కువ బడ్జెట్ తో రిలీజ్ అయి మంచి లాభాలను గడిచింది.