ముక్కోటి ఏకాదశి కారణంగా తిరుపతిలో భక్తుల హడావిడి… వైకుంఠ ద్వారం నుంచి శ్రీవారి దర్శనం…!

సాధారణంగా చిన్న తిరుపతి అయినా పెద్ద తిరుపతి అయినా భక్తులు భారీగా ఉంటారు. ఇక సాధారణమైన రోజులలో భక్తులు కిటకిటలాడుతూ ఉంటారు. ఇక ఈరోజు ముక్కోటి ఏకాదశి కావడంతో భక్తులు శ్రీవారిని చూసేందుకు భారీగా తరలి వెళ్లారు. తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వైకుంఠ ద్వారం తెరుచుకుంది.

శనివారం వేకువ జామున 1:30 గంటలకు ఆలయం అర్చనలు శాస్త్రోక్తంగా శ్రీవారి ఆలయానికి పక్కనే ఉన్న వైకుంఠం ద్వారాన్ని తెరిచారు. ముందుగా శ్రీనివాసుడికి నిత్య కైంకర్యాలు, ప్రత్యేక పూజలు చేశారు. ఇక అనంతరం అనేక రాష్ట్రాల నుంచి ప్రజలు తరలి వచ్చారు. ఇక ఈ ఉత్సవాన్ని మీడియా టీవీలలో కూడా చూపిస్తున్నారు.

ఇక ఈరోజు కేవలం భక్తులు మాత్రమే గుడికి వెళ్లడం కాకుండా ప్రముఖ సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు సైతం వెళ్తున్నారు. వారికోసం స్పెషల్ దర్శనం కూడా ఏర్పాటు చేస్తున్నారు ప్రభుత్వం. ఇక భక్తుల విషయానికి వస్తే… ఇంచు గ్యాప్ కూడా లేకుండా కూరుకు పోయారు. దాదాపు దర్శనానికి ఒకరోజు పడుతుందట. ఇక పొద్దున్నే ఐదు గంటలకు క్యూలో నుంచున్నవారు సాయంత్రం 6 గంటలకి ఆలయంలోకి ప్రవేశిస్తే అదృష్టంగా భావిస్తున్నారు.