ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌.. షారుక్ తోక ముడిచేశాడా…!

బాలీవుడ్ బాదుషా షారుక్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ డంకీ.. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుంది అంటూ వార్త‌లు వినిపించాయి. బాలీవుడ్ మీడియాలో దీనికి సంబంధించిన న్యూస్లు ఇప్పటికే వైరల్ అయ్యాయి. జవాన్, పఠాన్ సినిమాలతో పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బాస్టర్ కొట్టిన షారుక్.. డంకీతో హ్యాట్రిక్ కొట్టాలని ప్రయత్నిస్తున్నట్లు.. అందుకే ఈ సినిమాను సౌత్, నార్త్ లోను భారీ లెవెల్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇక ఈ సినిమాకు ఒక్కరోజు ముందే ప్రభాస్ స‌లార్‌ రిలీజ్ కావడంతో సలార్‌- డంకి రెండు సినిమాల మధ్యన గట్టి పోటీ ఉండబోతుందంటూ మీడియాలో చర్చలు కూడా మొదలయ్యాయి.

Dunki Movie Poster Launched - businessoftollywood

కానీ ప్రస్తుతం డంకీ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అవుతుందా.. లేదా.. అనే దానిపై క్లారిటీ రాలేదు. ఈ సినిమా తెలుగు వెర్షన్ గాని, తమిళ్ వర్షన్ గురించి కానీ ఇప్పటివరకు ఎటువంటి అనౌన్స్మెంట్ రాలేదు. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి పఠాన్, జవాన్ సినిమాలను తెలుగు వర్షన్ లో రిలీజ్ చేశారు. కానీ ఈసారి డంకీ తెలుగు వర్షన్ విషయంలో రాజ్‌కుమార్ హీరోని వేరే ఆలోచ‌న‌లో ఉన్నాడ‌ట‌. ఇది కేవలం అర్బన్ నేటివ్ సినిమా.. క్లాస్ ప్రేక్షకులు మాత్రమే నచ్చుతుందట.. మాస్ ని థియేటర్కు రప్పించే సినిమా ఇది కాదని.. మొదటి నుంచి న్యూస్ వైరల్ అవుతుంది. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ కూడా ఇది క్లాస్ సినిమానే మాస్ ఆడియన్స్ కు ఎక్కదు అన్న క్లారిటీ వచ్చేసింది.

Prabhas' Salaar Sparks 'Absolute Chaos' In Telugu Industry, And No SRK's  Dunki Is Not The Reason - News18

దీంతో డంకీ డ్రాప్ 4 యూట్యూబ్ లో రికార్డు న్యూస్ దక్కాయని ప్రచారం జరిగిన.. ట్రైలర్ లో మాత్రం మ్యాట‌ర్ లేదంటూ టాక్ వినిపిస్తుంది. దీంతో డంకీ విషయంలో పాన్ ఇండియా రిలీజ్ ను ఆపేయవచ్చు అని సమాచారం. ఒకవేళ ఇదే జరిగితే సలార్‌, డంకీ రేసులో డంకీ డ్రాప్ అయినట్లే అవుతుంది. ఇక సలార్ సినిమాకు మాస్, క్లాస్ అనే తేడా లేకుండా అన్ని వైపుల నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను సౌత్, నార్‌లోను భారీ లెవెల్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీంతో డంకి తెలుగు, తమిళ్ వర్షన్స్ రాకపోతే సలార్ ఎదురులేకుండా భారీ ఓసినింగ్స్‌తో దూసుకుపోవడం ఖాయం అంటూ ప్ర‌చారం జ‌రుగుతుంది.