య‌ష్‌19లో సాయి పల్లవి.. డైరెక్టర్ ఎవ‌రో తెలుసా.. అస‌లు గెస్ చేయ‌లేరు..!!

కేజిఎఫ్ ఫేమ్ యష్ మనందరికీ సుపరిచితమే. ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన కేజిఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎదిగాడు యష్. ఇక ఈ సినిమా విడుదలై దాదాపు ఏడాది అవుతున్నప్పటికీ మరో సినిమాకి సైన్ చేయలేదు ఈ యంగ్ హీరో. ఇక దీంతో అభిమానులంతా ” యష్ 19 ” సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక తాజాగా ఈయన నుంచి ఓ అప్డేట్ వచ్చింది.

డిసెంబర్ 8న శుక్రవారం ఉదయం 9 గంటల 55 నిమిషాలకు ” యష్ 19 ” సినిమా టైటిల్ ను ప్రకటిస్తున్నట్లు తెలిపాడు యష్. ఇక ఈ సినిమాకి దర్శకుడిగా ఎవరు వ్యవహరిస్తున్నారు అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ సినిమాకు సంబంధించిన ఎంతోమంది నటీనటుల పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పటికీ.. అందులో సాయి పల్లవి పేరు మాత్రం స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఇండస్ట్రీలో న్యాచురల్ బ్యూటీగా గుర్తింపు సంపాదించుకున్న సాయి పల్లవి.. ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఆకట్టుకుందో మనందరికీ తెలిసిందే.

ఇక ఈ ముద్దుగుమ్మ ఒక్క తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం వంటి భాషల్లో కూడా ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు పొందింది. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ” యష్ 19 ” సినిమాలో హీరోయిన్ గా ఈ ముద్దుగుమ్మ నటిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ వార్త విన్న ప్రేక్షకులు..” ఈ వార్త కనుక నిజం అయితే.. ఈ సినిమా ప‌క్కా సూపర్ హిట్ అవుతుంది. ఈ జోడి సూపర్ గా మ్యాచ్ అవుతుంది కూడా…” అంటూ కామెంట్లు చేస్తున్నారు.