డార్లింగ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ” యానిమల్ ” బ్యూటీ త్రిప్తి .. నక్క తోక తొక్కిందిగా..!!

అదృష్టం ఉండాలేగాని ఒకే ఒక్క సినిమాతో స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ అందుకుంటున్నారు కొంతమంది హీరోయిన్లు. వంద సినిమాలు చేసినా ఒక్కటే… ఒకే ఒక హిట్ సినిమా చేసినా ఒక్కటే అన్నట్లు అయిపోయింది ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ. అలాంటి లిస్ట్ లోనే చేరిపోయింది ” యానిమల్ ” బ్యూటీ త్రిప్తి దిమ్రీ. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ” ప్రాజెక్ట్ కే ” కూడా షూటింగ్ దశలో ఉంది.

అలాగే వీటితో పాటు ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ” స్పిరిట్ ” సినిమా కూడా ప్రభాస్ లైన్ అప్ లో ఉంది. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో యానిమల్ బోల్డ్ బ్యూటీ త్రిప్తి దిమ్రీ ని తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ ముద్దుగుమ్మ యానిమల్ సినిమాలో జోయా అనే క్యారెక్టర్ లో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఈ ముద్దుగుమ్మ కనిపించింది కొద్దిసేపే అయినప్పటికీ… రణబీర్ తో చేసిన రొమాన్స్ సీన్స్ తో అందరికీ షాక్ ఇచ్చింది.

ఇక దీంతో సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది ఈ బ్యూటీ. ఈ క్రమంలోనే ఈమె పేరు సోషల్ మీడియాలో మారుమోగడంతో.. ప్రభాస్ సినిమాలో ఛాన్స్ ఇచ్చినట్లు సమాచారం. ప్రభాస్ సినిమాలో ఈ ముద్దుగుమ్మ మెయిన్ హీరోయిన్ అయితే కాదట. బహుశా రెండో హీరోయిన్ గా నటిస్తుందేమో అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.