” చిన్న వయసులోనే అతను నన్ను తల్లిని చేశాడు “.. స్టార్ యాక్ట‌ర్‌ సెన్సేషనల్ కామెంట్స్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది నటీనటులు ఉన్నప్పటికీ అందులో కొంతమంది మాత్రమే పాపులారిటీ ని సొంతం చేసుకుంటారు. కొంతమంది ఎన్ని మంచి పాత్రలు చేసినప్పటికీ సక్సెస్ దరిచేరదు. అయితే మరి కొంతమంది మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేసి ఎంతో పాపులారిటీ ని సొంతం చేసుకుంటారు. ఈ లిస్టులో ముందుగా కనిపించే పేరు నటి ప్రగతి. టాలీవుడ్ నటి ప్రగతి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ముఖ్యంగా కమెడియన్ బ్రహ్మానందం భార్యగా చాలా సినిమాలలో నటించి అందరిని అలరించింది ఈ ముద్దుగుమ్మ.

ఇక ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈమె… తన అంద చందాలను ఆరబోస్తూ కుర్రాళ్లకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. ఇక ఈమధ్య కాలంలోనే సోషల్ మీడియాలో తన జిమ్ వీడియోలు పెట్టి.. బాగా పాపులర్ అయింది. అంతేకాదు మొన్నా జాతీయస్థాయిలో అవార్డు కూడా సొంతం చేసుకుంది. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ఈమె మాట్లాడుతూ …” ఇండస్ట్రీలోకి వచ్చేటప్పుడు హీరోయిన్ కావాలని అనుకున్న. కానీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఛాన్సెస్ అసలు రాలేదు. ఇక దీంతో హీరోయిన్గా కాకుండా తల్లి పాత్రలలో.. సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలలో నటించమని ఒక వ్యక్తి చెప్పాడు. అలా అయితే లైఫ్ లాంగ్ నీకు ఛాన్సులు వస్తాయని సదరు వ్యక్తి సలహా ఇచ్చాడు. దీంతో అప్పటినుంచి తల్లి పాత్రలలో నేను కనిపిస్తున్నాను. ఇక దీంతో చిన్నప్పుడే నేను తల్లి అయ్యాను “… అంటూ కామెంట్లు చేసింది. ప్రస్తుతం ఈమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.