మహేష్ బాబు ఇంట మొదలైన క్రిస్మస్ సెల‌బ్రేష‌న్స్‌.. ఆకట్టుకుంటున్న సితార క్యూట్ లుక్స్..

సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితారకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇప్పటికే తన పర్సనల్ విషయాలను, ప్రొఫెషనల్ విషయాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటూ కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్న ఈ స్టార్ కిడ్.. మహేష్ బాబు ఇమేజ్ తో ఎదగాలని ప్రయత్నించకుండా.. తన సొంత టాలెంట్ తో దూసుకుపోతుంది. అతి చిన్న వయసులోనే ఓ ప్రముఖ జ్యువెలరీ సంస్థ‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించి మంచి పాపులారిటీ దక్కించుకుంది. ఇక ప్రస్తుతం పలు సినిమాల్లో కూడా సితార కీల‌క పాత్ర‌లో నటిస్తుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక సితార ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటుంది. తన ఫ్యామిలీతో వెకేషన్ లో ఎంజాయ్ చేసిన ఫోటోలను, హ్యాపీ మూమెంట్లను ఇన్‌స్టా వేదికపై ఫ్యాన్స్ కు షేర్ చేస్తుంది. ప్రస్తుతం సితార ఇన్‌స్టా ఫాలోవ‌ర్ల సంఖ్య 1.6 మిలియన్లుగా ఉంది. ఇక ప్రస్తుతం డిసెంబర్ నెల అంటే క్రిస్మస్ మంత్ షోరూ. చాలామంది సెలబ్రిటీస్ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. వారిలో మహేష్ బాబు కుటుంబం కూడా ఒక‌టి. తాజాగా మహేష్ బాబు ఇంట క్రిస్మస్ పండుగ సెలబ్రేషన్స్ మొదలైపోయాయి.

ఇక క్రిస్మస్ పండుగ సెలబ్రేషన్స్ కు సంబంధించిన వీడియో.. సితార ఇన్‌స్టా వేదికపై షేర్ చేసుకుంది. ఈ సందర్భంగా సితార కోసం మహేష్ బాబు ఇంట్లో క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేశాడు. ఆ ట్రీ వ‌ద్ద సితారా శాంటా క్యాప్ ధ‌రించి క్యూట్ లుక్స్‌తో క్రిస్మస్ పాటకు రీల్ చేస్తూ ఆ విడియో సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. 20 రోజులు ముందే సూపర్ స్టార్ ఇంట‌ సంబరాలు మొదలు పెట్టేసాడు అంటూ.. సో క్యూట్ సితార యువర్ లూకింగ్ బ్యూటిఫుల్ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.