” సలార్ ” సినిమాకి ఫైనల్ టచ్ ఇచ్చేందుకు సిద్ద‌మైన ప్ర‌భాస్..!!

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా దగ్గర మోస్ట్ అవైటెడ్ గా ఉన్న సినిమాలలో.. ” సలార్ ” మూవీ ఒకటి. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ప్రభాస్ వరుస ఫ్లాప్స్ తరువాత వస్తున్న సినిమా కావడంతో… ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకున్నాయి.

ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడడంతో మేకర్స్.. ఈ సినిమాకి సంబంధించిన అన్ని పనులను కంప్లీట్ చేసే హడావిడిలో ఉన్నారు. ఇక వీటితోపాటు ప్రభాస్ సైతం తన ఫైనల్ వర్క్ లో ఉన్నట్లుగా సమాచారం. ఈ క్రమంలోనే ప్రభాస్ ప్రస్తుతం తన డబ్బింగ్ పనులలో బిజీగా ఉన్నాడు.

ఇక ప్రస్తుతం ప్రభాస్ తన అన్ని వర్షన్ ల డబ్బింగ్లను హైదరాబాద్లోనే కంప్లీట్ చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ పాన్ ఇండియా సినిమాకి రవి బసృర్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ఈనెల 22న గ్రాండ్ లెవెల్ లో ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇక ఈ సినిమాపై ప్రభాస్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకున్నాయి.