అయ్యయ్యో.. శ్రీలీలకి పెద్ద కష్టమే వచ్చిందే.. అంతా బాగుంది అనుకున్న టైంలో ఈ లొల్లి ఏంటి ..?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో శ్రీ లీల పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా ఓవైపు చదువు మరోవైపు సినిమాలలో నటిస్తూ తన కెరీర్ను తన ప్యాషన్ ని ముందుకు తీసుకెళ్తుంది ఈ బ్యూటీ . అయితే ఇప్పుడు శ్రీలీలకి పెద్ద టఫ్ టైం ఎదురయింది . ఇన్నాళ్లు బుద్ధిగా సినిమాలు చేసుకుంటూ చదువుకుంటూ వెళ్లిపోయిన శ్రీ లీల కు.. ఇప్పుడు పరీక్షల సమయం ఆసన్నమైందట .

అయితే గతంలోలా పరీక్షలు రాస్తూనే ఈసారి షూటింగ్లో పాల్గొనే ఛాన్స్ ఆమెకు లేదు. ఎందుకంటే ఈసారి ఆమె లైవ్ సెషన్స్ లో పాల్గొనాల్సి ఉంటుంది . అప్పట్లో ఎగ్జామ్స్ అంటే శ్రీ లీల నైట్ చదువుకొని మార్నింగ్ ఎగ్జామ్ రాసి ఆఫ్టర్నూన్ షూట్ కి వచ్చేది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి కాదు దాదాపు నెల రోజులపాటు ఆమె లైవ్ ప్రాక్టీస్ చేసి.. టెస్ట్ చేసి ఎగ్జామ్ రాయాలి ..

Actress Sree Leela Pictures @ Dhamaka Movie Press Meet

చదివితే బుర్రకి ఎక్కేది కాదు ఇది. ఈ క్రమంలోనే శ్రీలీల ఎటు తేల్చుకోలేని పొజిషన్లో ఉండిపోయిందట . ఒక పక్క సినిమాలు..? మరోపక్క చదువు ..? ఏది బ్యాలెన్స్ చేయాలో అర్థం కాక సతమతమైపోతుందట . దీంతో సోషల్ మీడియాలో శ్రీలీల పేరు మారు మ్రోగిపోతుంది . ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే..?