విజయ్‌ని టీనేజ్ కుర్రాడిగా చూపించేందుకు ఏకంగా రూ.6 కోట్లు ఖర్చు పెట్టనున్న ఆ మూవీ టీం..!!

కొలీవుడ్ స్టార్ హీరో విజయ్ తాజాగా లియో సినిమాతో భారీ బ్లాక్ బాస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ప్రస్తుతం విజేయ్ త‌న 68వ సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక సీనియర్ హీరోల విషయానికి వస్తే ఏ సినిమాలో అయినా ఫ్లాష్ బ్యాక్ పెట్టినప్పుడు వాళ్ళ వయస్సు తగ్గించేందుకు దర్శక, నిర్మాతలు ఎన్నో పాట్లు పడాల్సి వస్తుంది. టెక్నాలజీ వాడి ఎలాగొల ఏజ్ తగ్గించడానికి ప్రయత్నించినా కొన్ని కొన్ని సందర్భాల్లో తేడా కొడుతుంటాయి. అలాగే ఇప్పటికి టాలీవుడ్ లో చిరంజీవి, రవితేజ.. ఆచార్య, టైగర్ నాగేశ్వరరావు సినిమాల్లో ప్రయత్నించి బోల్తా పడ్డారు. అయితే ఇక్కడ రాజీ పడని బడ్జెట్ చాలా అవసరం.

Thalapathy Vijay is set to wrap up Leo shoot soon, will begin Thalapathy 68  next; Details here | PINKVILLA

ఖర్చు పెట్టడానికి వెనుకాడ‌ని ప్రొడ్యూసర్ దొరికినప్పుడు ఇలాంటివి చేయడం సాధ్యమవుతుంది. అయితే గత కొంతకాలంగా తెలుగులోనూ మంచి మార్కెట్ ను సంపాదించుకుంటున్నాడు విజయ్‌. అయితే అతని 68వ సినిమా కోసం న్యూ టెక్నాలజీని ఉపయోగించుకోబోతున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీలో విజయ ఓ టీనేజ్ బాయ్ లా కాసేపు కనిపించాల్సి ఉంటుందట. 19 సంవత్సరాల కుర్రవాడిలా విజయ్ కనిపించేందుకు డిఏజింగ్ టెక్నిక్ అవసరమని.. విదేశీ నిపుణులు దీనికోసం పనిచేయబోతున్నారని తెలిసింది. అయితే దీనికి ఏకంగా రూ.6 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందట.

Thalapathy 68 Update : தளபதி 68 படத்தில் யாரெல்லாம் இருக்காங்க தெரியுமா? |  actor vijay thalapathy 68 movie update | HerZindagi Tamil

దీనికి ప్రొడ్యూసర్స్ కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. ఈ సినిమాకు వెంకట ప్రభు దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే వెంకట ప్రభు చివరిగా తెరకెక్కించిన నాగచైతన్య కస్టడీ భారీ డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. దీంతోపాటు విజయ రెగ్యులర్ కమర్షియల్ మూవీ కాకుండా కొత్త ట్రీట్మెంట్, స్క్రీన్ ప్లే, కాన్సెప్ట్ తో ఈ సినిమాను తీయబోతున్నాడట. ఇప్పటికే కొంత భాగం పూర్తయింది. అయితే వెంకట ప్రభు విజయ్‌కి ఎలాంటి రిజల్ట్ అందిస్తాడో అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ఇక ఈ సినిమా ఓ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెలుస్తుంది.

Meenakshi Choudhary Joins Vijay For 'Thalapathy 68', Know More Details

టైటిల్ ని ఇంకా ప్రకటించలేదు. యావన్ శంకర్ రాజా మ్యూజిక్ తో, మానాడు తరహాలో ఈ క‌థ‌ కూడా ఉంటుంది. కానీ టైం ట్రావెల్ మూవీ కాదట. అయితే గతంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి సీనియర్ హీరోలు శ్రీదేవి లాంటి కుర్ర హీరోయిన్లతో కలిసి చిందులు వేసిన ప్రేక్షకులు వాటిని బాగా ఎంజాయ్ చేశారు. అయితే ఈ తరం హీరోల పక్కన నటించే హీరోయిన్ల విషయంలో కాస్త అటు ఇటుగా అనిపించిన ఇక మీమర్స్ ట్రోలింగ్‌కు పని చెప్తారు. అందుకే విజయ్ సినిమా విషయంలో అలాంటి కామెంట్స్ రాకూడదని మేకర్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.