ఏంటి ఆ చిరంజీవి-పవన్ కళ్యాణ్ కి ఏమన్నా పెద్ద పెద్ద కొమ్ములున్నాయా..? బిగ్ బాస్ శివాజీ షాకింగ్ కామెంట్స్..!!

శివాజీ నిన్న మొన్నటి వరకు నార్మల్ శివాజీ గానే పేరు పాపులారిటీ దక్కించుకున్న ఈయన ఇప్పుడు బిగ్ బాస్ శివాజీగా పాపులారిటీ దక్కించుకుంటున్నాడు. బిగ్ బాస్ హౌస్ లో టాప్ కంటెస్టెంట్ గా ఉన్న శివాజీ గతంలో ఇండస్ట్రీలో ఎంత పెద్ద టాప్ హీరోనో మనకు తెలిసిందే . అంతే కాదు ఉన్నది ఉన్నట్లు మాట్లాడడంలో శివాజీ ధిట్ట. పొలిటికల్ పరంగా కూడా వేలు పెట్టి తిట్టాడు తిట్టించుకున్నాడు.

కాగా గతంలో ఆయన ఓ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిరంజీవి పవన్ కళ్యాణ్ పై చేసిన కామెంట్స్ మరోసారి ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు . జాఫర్ తో ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా ఆయన అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వడంలో శివాజీ కూసింత హద్దులు మీరిపోయారు. జాఫర్ ఆయనను ప్రశ్నిస్తూ ..”మీరు ఏమైనా మెగాస్టార్ చిరంజీవి , పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారా..? అని అడగ్గా స్పందించిన శివాజీ ..

“వాళ్లకి ఏమన్నా ఎక్స్ట్రా కొమ్ములు ఉన్నాయా..? డబ్బులు వాళ్లకు చెట్లకు మొలుస్తాయా..?” అంటూ ఫైర్ అయ్యారు . అంతేకాదు పలువురు హీరోలపై కూడా శివాజీ మాట్లాడిన మాటలు మరోసారి ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు. బిగ్ బాస్ హౌస్ లో రన్నర్ గా నిలవబోతున్నాడు శివాజీ అని కొందరు అంటుంటే లేదు లేదు విన్నర్ గానే బయటికి వస్తాడు అని మరికొందరు అంటున్నారు . మరి కొద్ది రోజులు వెయిట్ చేస్తే ఆ విషయాలు క్లారిటీకి వచ్చేస్తాయి . ప్రెసెంట్ శివాజీ చేసిన ఒకప్పటి కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి..!!