“ధైరం చేసుకుని ఆ విషయం నేనే నాన్న అడిగేశా”.. ఫ్యామిలీ మ్యాటర్ ను బయటపెట్టిన సుమ కొడుకు రోషన్..!!

సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో యాంకర్ సుమ – రాజీవ్ కనకాల విడాకుల మేటర్ ఎంత హీట్ పెంచేసిందో మనకు తెలిసిందే. వరుసగా స్టార్ సెలబ్రిటీస్ అందరూ విడాకులు తీసుకుంటూ ఉన్న క్రమంలో సుమ రాజీవ్ కూడా వాళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరిగింది. అయితే చాలామంది జనాలు అది నమ్మేశారు .

వామ్మో నిజంగానే ఈ జంట విడాకులు తీసుకోబోతున్నారా ..? అంటూ బాధ పడిపోయారు. అయితే ఫైనల్లీ అదంతా ఫేక్ అంటూ కొట్టి పడేశారు సుమ రాజీవ్ కనకాల జంట. కాగా రీసెంట్గా ఇదే ఇష్యూపై సుమ కొడుకు రోషన్ స్పందించాడు. ఆయన నటించిన బబుల్గం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రోషన్ మాట్లాడుతూ..” నేను కూడా ఇలాంటి వార్తలు చాలా చదివాను ..షాక్ అయిపోయాను.. అందుకే వెంటనే మా అమ్మ నాన్న ను అడిగేసాను”..

” ఏంటి మీరు విడాకులు తీసుకోబోతున్నారా ..? అని వెంటనే మా అమ్మ మా నాన్న నవ్వుకున్నారు ఛీ ఛీ అలాంటిదేమీ లేదు . అదంతా ఫేక్ అంటూ కొట్టి పడేశారు”. అప్పుడు ప్రశాంతంగా ఫీల్ అయ్యాను. ఆ తర్వాత కూడా చాలా సార్లు ఇలాంటి వార్తలు చదివాను. అప్పుడే అర్థమైంది ఇలాంటివి ఎవరో కావాలని పుట్టిస్తున్నారు అని.. ఆ తర్వాత అలాంటి వార్తలను పట్టించుకోవడమే మానేశాను అంటూ చెప్పుకొచ్చాడు రోషన్.