శ్రియకు టాలీవుడ్ లో అవకాశాలు రాకుండా చేసిన ఆ స్టార్ హీరో.. కారణం ఇదే..?!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటినట్లకు ఎప్పుడు దర్శక నిర్మాతల నుంచి ఏవో ఒక సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. ఇక స్టార్ హీరోయిన్స్ కైతే స్టార్ హీరోల నుంచి కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. ఎప్పుడూ వారికి నచ్చినవి హీరోయిన్స్ చేయాలంటూ వారి కోరికలు తీర్చాలంటూ హీరోయిన్లను ఇబ్బంది పెడుతూ ఉంటారు. వారు చెప్పింది చేయకపోతే వారి సినీ కెరీర్‌కు అడ్డుపడుతూ ఉంటారు. అలాంటి సంఘటనే ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఎదిగిన శ్రీయ శరణ్ జీవితంలో కూడా ఎదుర్కొందట. ఆమె ఓ టాలీవుడ్ హీరో కారణంగా ఇండస్ట్రీలో అవకాశాలను కోల్పోయినట్లు తెలుస్తుంది.

Shriya Saran Saree Photos

ఒకప్పుడు తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగిన ఈ ముద్దుగుమ్మ.. మూడో తరం హీరోలతో కూడా నటించి మెప్పించింది. ఎన్నో హిట్ సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్‌ను సంపాదించుకున్న శ్రియ ఉన్న ఫలంగా సినిమా అవకాశాలు తగ్గడంతో కొంతకాలం ఇండస్ట్రీకి దూరమైంది. అయితే తిరిగి మళ్లీ రీఎంట్రీ ఇచ్చి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలో స్థిరపడిన.. ఈమెకు మొదట్లో సినిమా అవకాశాలు రాకపోవడానికి కారణం ఇండస్ట్రీలో ఉన్న ఓ స్టార్ హీరోఅట.

Shriya Saran Saree Look | Shriya Saran Saree Look: एक्ट्रेस श्रिया सरन के  ये साड़ी लुक्स चुरा लेंगे आपका दिल, वेडिंग सीजन के लिए लें इंस्पिरेशन

శ్రీయాను అతను పెళ్లి చేసుకోవాలని టార్చర్ చేశాడని.. అయితే అప్పటికే ఆ హీరో కి పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉండడంతో శ్రీయకు అతన్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక రిజెక్ట్ చేసిందని తెలుస్తుంది. ఆ కారణంగానే శ్రియాపై కోపంతో ఆ హీరో తన ఇన్ఫ్లుయన్స్ ని ఉపయోగించి అవకాశాలు రాకుండా అడ్డుపడ్డాడట. అలా కొంతకాలం పాటు అవకాశాలు ఏవి రాకపోవడంతో శ్రీయ ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చింది. అయితే ఇటీవల రీఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ తెలుగు, తమిళ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తుంది.