స‌లార్ సెన్సార్ పూర్తి.. ర‌న్ టైం ఎంతో తెలుసా..? కెరీర్ ఫస్ట్ టైం రూల్స్ బ్రేక్ చేసిన ప్రభాస్..!

టాలీవుడ్ రెబల్ హీరో ప్రభాస్ తాజాగా నటిస్తున్న సినిమా సలార్ . పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతుంది . మొదటి పార్ట్ సీజ్ ఫైర్ అనే పేరుతో డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్ . ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని కూడా రిలీజ్ చేశారు .

టాక్ పరంగా అటు ఇటుగా ఉన్న వ్యూస్ పరంగా మాత్రం దుమ్ము దులిపేసింది . ప్రభాస్ నటించిన సలార్ సినిమా ట్రైలర్ అన్ని భాషల్లో కలిపి 150 మిలియన్లకు పైగా వ్యూస్ దక్కించుకుంది అంటే ఆయన క్రేజీ ఏ రేంజ్ లో అర్థం చేసుకోవచ్చు. రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించిన సెన్సార్ కూడా పూర్తయింది . సెన్సార్ బృందం ఏ సర్టిఫికెట్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తుంది . ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ తో పాటు వైలెన్స్ కూడా కొంచెం ఎక్కువగా ఉండడంతో ..ఏ సర్టిఫికెట్ ఇచ్చారట.

అంతేకాదు ఈ సినిమా రన్ టైం ఏకంగా రెండు గంటల 55 నిమిషాల 22 సెకండ్లకు లాక్ చేశారు . ప్రభాస్ కెరియర్ లో ఇంత లాంగ్ లెంత్ రన్ టైమ్ ఉన్న సినిమాలు చాలా తక్కువ. అయితే అలా వచ్చిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ . అయితే సలార్ కూడా చరిత్ర తిరగరాయబోతుంది అంటున్నారు అభిమానులు..!!