ప్రభాస్ ‘ కల్కి ‘ మూవీ ని వదులుకున్న మోస్ట్ అన్ లక్కీ టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా..?

ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న పాన్ ఇండియన్ మూవీస్ లో కల్కి 2898 మూవీ ఒక‌టి. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమాకు నాగ అశ్విన్ దర్శకత్వం వహిస్తుండగా.. దీపికా పదుకొనే హీరోయిన్గా, కమలహాసన్ విలన్ రోల్ లో నటిస్తున్నారు. అమితా బచ్చన్, దుల్కర్ సల్మాన్, దిశా పఠాని కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు కమల్ హాసన్ షూటింగ్ తప్ప.. మిగతా షూటింగ్ పార్ట్ అంతా పూర్తయినట్లు తెలుస్తుంది. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

సినిమాలో శ్రీమహావిష్ణువు 11వ‌ అవతారం కల్కి అని.. 2,898వ‌ సంవత్సరంలో అవతరించిన ఈ మహావిష్ణు అవతారాన్ని కొన్ని సంఘటనలు కారణంగా సైంటిస్ట్ ప్రస్తుత కాలానికి తీసుకువస్తారని.. అదే ప్రాజెక్ట్‌ కే అంటూ తెలుస్తుంది. ఈ కథాంశం పైనే సినిమా రన్ అవుతుందని స‌మాచారం. ఇక మహానటి కంటే ముందే నాగ అశ్విన్ ఈ సినిమాని వేరే హీరోతో తీయాలని అనుకున్నారట. మొదట ఈ సినిమాను రాసుకున్నప్పుడు ప్ర‌భాస్ కాకుండా.. రామ్ చరణ్‌ను ఈ సినిమాల్లో తీసుకోవాలని భావించాడట నాగ అశ్విన్‌. స్టోరీ విన్న రామ్ చరణ్ కథ చాలా ఆసక్తిగా ఉంది.

కానీ మొదటి సినిమానే ఇంత పెద్ద ప్రాజెక్టును భుజాల మీద మోయగలవా.. నువ్వు ఒకటి, రెండు సినిమాలను తీసి ఆ తరువాత రా మళ్లీ మనం ఈ సినిమాని చేద్దామని రామ్ చరణ్ అన్నాడట. ఆ తర్వాత మహానటి రావడం ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ సంపాదించడం జరిగింది. తరువాత ఇదే ప్రాజెక్ట్‌కే స్క్రిప్ట్‌ను ప్రభాస్‌కు వినిపించగా వెంటనే ప్రభాస్ సింగిల్ సీటింగ్ లోనే ఓకే చెప్పేసాడట. దీంతో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందని ఈ సినిమా కోసం కేవలం టాలీవుడ్ ప్రేక్షకులే కాకుండా పాన్ ఇండియా ఆడియన్స్ కూడా ఎదురు చూస్తున్నారు.