వెంకీ ” సైంధవ్ ” మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆ స్టార్ హీరో హాజరు.. ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్…!

టాలీవుడ్ మోస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ హీరో ఎవరైనా ఉన్నారా అంటే ముందుగా విక్టరీ వెంకటేష్ పేరే వినిపిస్తుంది. వెంకీ కెరీర్ నాటి నుంచి నేటి వరకు ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పిస్తూ తన సినీ కెరీర్ ని కొనసాగిస్తున్నాడు. ఇక తాజాగా వెంకటేష్ హీరోగా నటిస్తున్న మూవీ ” సైంధవ్ “.

ఈ సినిమాపై వెంకీ అభిమానులతో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక శైలేష్ రూపొందిస్తున్న ఈ మూవీ జనవరి 13న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం… ఈ మూవీ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ” ఓజి ” హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక ప్రస్తుతం ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో నెట్టింటల‌ వైరల్ అవుతుంది. ఇక ఈ వార్త నిజం అయితే మాత్రం వెంకీ కెరీర్ లో మరో సూపర్ హిట్ పడుతుందనే చెప్పాలి. ఎందుకంటే పవర్ స్టార్ ఫాలోయింగ్ అలా ఉంటుంది మరి. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.