నాగ్ ” నా సామిరంగ ” టైటిల్ సాంగ్ ప్రోమో రిలీజ్ డేట్ అండ్ టైం లాక్… ఎప్పుడంటే..!

కింగ్ నాగార్జున గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. వయసు మీద పడుతున్న ఏమాత్రం పట్టించుకోకుండా కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తూ సినిమా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు నాగ్. ఇక నాగార్జున హీరోగా ఆషిక రంగనాథ్ హీరోయిన్గా యువ దర్శకుడు విజయ్ బిన్నీ దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ మూవీ ” నా సామి రంగ “.

అల్లరి నరేష్ మరియు రాజ్ తరుణ్ కీలక పాత్రలలో నటిస్తున్న ఈ మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్లూరి నిర్మిస్తున్నారు. అలాగే ఈ భారీ మూవీకి ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయినటువంటి ఫస్ట్ లుక్ టీజర్, ఫస్ట్ సాంగ్ తో పాటు అల్లరి నరేష్, రాజ్ తరుణ్ గ్లింప్స్ టీజర్స్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి.

ఇక అసలు విషయం ఏమిటంటే.. ఈ మూవీ నుంచి టైటిల్ సాంగ్ ప్రోమో ని రేపు ఉదయం 10 గంటల 8 నిమిషాలకు రిలీజ్ చైన్ ఉన్నట్లు మేకర్స్ కొద్దిసేపటి క్రితమే అనౌన్స్ చేశారు. ఇక సంక్రాంతికి రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైన ఈ మూవీ యొక్క అఫీషియల్ రిలీజ్ డేట్ కూడా రేపే అనౌన్స్ చెయ్యనున్నారు.