ప్రభాస్ సలార్ సినిమా సూపర్ హిట్ అయ్యిందని అనుష్క ఏం చేసిందో చూశారా.. ప్రేమంటే ఇదేగా..!

సలార్ సినిమాకి ఎంతమంది రివ్యూలు ఇచ్చిన ప్రభాస్ ఫ్యాన్స్ కి సరిపోదు . ఇవ్వాల్సిన వాళ్ళు రివ్యూ ఇస్తేనే బాగుంటుంది . అలాంటి రివ్యూ వచ్చేసింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ నటించిన సలార్ సినిమాకు ఆయన జాన్ జిగిడి దోస్త్ అనుష్క అద్దిరిపోయే రివ్యూ ఇచ్చింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

అందరిలాగా సోషల్ మీడియాలో.. వెబ్ మీడియాలో సినిమా బాగుంది .. ఎక్స్ట్రాడినరీ అంటూ లేకుండా పర్సనల్గా ప్రభాస్ కు సలార్ సినిమాలో నటించిన మాస్ లుక్ కి సంబంధించిన ఇమేజ్ ని తయారు చేయించి మరి తన ఇంటికి పార్సల్ చేసిందట . అంతేకాదు సలార్ సినిమా సూపర్ హిట్ అయినందుకు కంగ్రాజులేషన్స్ డార్లింగ్ అంటూ చెబుతూ..

” కొన్ని కొన్ని పాత్రలు కొందరి కోసమే పుడతాయి.. ఈ పాత్ర నీకోసమే పుట్టింది అంటూ స్పెషల్ గిఫ్ట్ కార్డు కూడా పంపించిందట”. ప్రజెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . అంతేకాదు ప్రభాస్ సినిమాకు అనుష్క రివ్యూ ఇవ్వడం అభిమానులకు ఆనందంగా కూడా మారిపోయింది. తన ప్రేమను ఇలా బయటపెట్టింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!!