” దేవర ” లో తారక్ ఆ ఒకే ఒక్క లుక్ సినిమా మొత్తంలో హైలెట్ కానుందా.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు…!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా.. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” దేవర ” పై ఏ రేంజ్ అంచనాలు నెలకొన్నాయో మనందరికీ తెలిసిందే. ఇక దేవర సముద్రం నేపథ్యంలో జరుగుతుందనే విషయం తెలిసిందే. ఈ సినిమాలో హైలెట్ సీక్వెన్స్ గురించి ఓ రూమర్ వినిపిస్తుంది.

దేవర ఇంటర్వెల్ సీక్వెన్స్ లో వచ్చే గంగమ్మ జాతరలో గంగమ్మ తల్లి భక్తుడిగా ఎన్టీఆర్ నటన టోటల్ సినిమాకే హైలెట్ అవ్వనుందట. ఈ జాతర ఎపిసోడ్లో ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందట. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ కథానాయకగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమా కోసం లెంతీ షెడ్యూల్స్ ను ప్లాన్ చేస్తున్నాడు కొరటాల శివ. కాబట్టి ఈ సినిమా షూట్ సరివేగంగా జరగనుంది. అలాగే ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ కూడా అదిరిపోతుందట. ఇక మొత్తానికి ఈ సినిమా కోసం కొరటాల శివ మంచి కసరత్తులు చేస్తున్నాడు. ఇక ఇప్పటికే ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్లో గతంలో వచ్చిన ” జనతా గ్యారేజ్ ” పెద్ద హిట్ అవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకున్నాయి.