ప‌వ‌న్ వైఫ్ అన్నా లెజ్నోవాది ఇంత మంచి మ‌న‌స్సా… ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ…!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన మొదట్లో నందిని అనే ఓ అమ్మాయిని పెళ్లి చేసుకుని అనంతరం విడాకులు తీసుకున్నారు. ఇక ఆ తరువాత రేణు దేశాయ్ తో ప్రేమలో పడి.. ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఇక వీరిద్దరికీ ఇద్దరు సంతానం కూడా కలిగారు. అనంతరం ఏవో మనస్పార్ధాలు కారణంగా వీరిద్దరూ సైతం విడాకులు తీసుకున్నారు.

ఇక ప్రస్తుతం పవన్ మూడో భార్య అన్నా లెజినోవా తో ఉంటున్నాడు. ఈమె ఓ క్రిస్టియన్ అన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రతి ఏడాది ఈమె క్రిస్మస్ వేడుకలని అంగరంగ వైభోగంగా జరుపుకుంటుంది. ఇక తాజాగా 2023 ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ను అన్నా లెజినోవా ఓ అనాధ శరణాలయంలో ఆదివారం జరుపుకుంది.

హైదరాబాద్ బాలాజీ స్వర్ణపురి కాలనీలో ఉన్న జీవోదయ హోమ్ ఫర్ ద చిల్డ్రన్ లోని చిన్నారులతో కలిసి ముచ్చటించారు. అనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేసి అక్కడ ఉన్న అనాధ పిల్లలకి తినిపించింది అన్నా లెజినోవా. ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోస్ ను జనసేన పార్టీ ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలను చూసిన పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.