ప్రభాస్ ” సలార్ ” మూవీకి రిషబ్ శెట్టి రివ్యూ..!

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” సలార్ ” తొలిరోజే 178 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ను సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డును సృష్టించింది. ఈ మూవీపై ప్రేక్షకులలో ఏ స్థాయిలో అంచనాలు నెలకున్నాయి చెప్పడానికి ఈ బుకింగ్స్ సాక్ష్యం అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

ఇక తాజాగా సలార్ సినిమాను చూసిన పలువురు సెలబ్రిటీలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే రిషబ్ శెట్టి కూడా సలార్‌ సినిమాపై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. రిషబ్ తన ట్వీట్లో..” సలార్ 1 సీజ్ ఫైర్ అత్యంత అద్భుతమైన మాస్ సినిమాలలో ఒకటి గా నిలుస్తుంది. ఇక ఈ సినిమాలో అద్భుతంగా నటించిన ప్రభాస్ సార్ నటనకు అభినందనలు.

వరద రాజమన్నార్ పాత్రను పోషించిన పృధ్విరాజ్ కు ప్రత్యేక ప్రశంసలు. అలాగే ఫ్రెండ్ షిప్ నేపథ్యంలో అద్భుతమైన కథను ప్రశాంత్ నీల్ తెరకెక్కించారు. హోంబలే ఫిల్మ్స్ నిర్మాతలకు, విజయ్ కిరగందూర్ అన్నకు హృదయపూర్వక అభినందనలు ” అంటూ చెప్పుకొచ్చాడు రిషబ్. ప్రస్తుతం ఈ న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.