విధి ఆడిన విచిత్రం.. సోషల్ మీడియాలో వచ్చే రూమర్స్ నే నిజం చేసిన స్టార్ హీరోయిన్..!

సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన స్టార్ సెలబ్రిటీస్ పై ఎలాంటి రూమర్స్ వినపడుతూ ఉంటాయో మనకు తెలిసిందే . మరీ ముఖ్యంగా బడాబడా స్టార్ హీరోయిన్స్ హీరోస్ పై అయితే కుప్పలు కుప్పలుగా వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయి . కొన్ని కొన్ని సార్లు అవి విసుగు తెప్పించిన మరికొన్నిసార్లు అవి మనకి మంచి చేసి పెడతాయి . అదే విషయం ఇప్పుడు హీరోయిన్ తాప్సి కి మంచి చేసి పెట్టింది.

హీరోయిన్ తాప్సి తెలుగులో “ఝుమ్మంది నాదం” అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించి కోలీవుడ్ లోనూ హీరోయిన్గా నటించింది . ఆ తర్వాత బాలీవుడ్ కి చెక్కేసింది. ఇప్పుడు బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయింది . అయితే షారుక్ ఖాన్ నటించిన డంకీ సినిమాలో ఆమె హీరోయిన్గా నటించింది .

షారుక్ ఖాన్ సినిమాలో హీరోయిన్ అంటే మాటలా ఎంతోమంది ఆ రోల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు . అయితే “డంకి” సినిమా అనౌన్స్ చేయగానే తాప్సి కూడా అందరిలాగే ఎవరు ఈ సినిమాలో హీరోయిన్ అయి ఉంటారా అంటూ వెయిట్ చేసిందట. తెలుసుకోవడానికి ఆసక్తి చూపించిందట. అయితే సోషల్ మీడియాలో తాప్సీనే హీరోయిన్ అంటూ రావడంతో షాక్ అయిపోయిందట .

సరే వినడానికి బాగుందిలే నిజం కాకపోయినా ఎంజాయ్ చేద్దామంటూ లైట్ గా తీసుకుందట . ఫైనల్లీ ఆ డైరెక్టర్ వచ్చి తాప్సీ ని హీరోయిన్ అని చెప్పాక షాక్ అయిపోయిందట . అలా సోషల్ మీడియాలో వైరల్ అయిన రూమర్ నిజంగానే ఆమెకు మంచి లక్ ని తెచ్చి పెట్టింది . కలెక్షన్స్ పరంగా అటు ఇటు ఉన్న నటన పరంగా తాప్సి వేరే లెవెల్ అని ప్రూవ్ చేసుకున్నింది..!