స్టార్ సెలబ్రిటీస్ అందరినీ వదిలేసి మరి.. ఆ యంగ్ హీరోని మాత్రమే ఫాలో అవుతున్న ఇన్‌స్టా..

సోషల్ మీడియా మూల స్తంభంగా మెటా యాజమాన్యంలోని ఫోటో షేరింగ్, మెసేజింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్ ఉన్న సంగతి తెలిసిందే. ప్రజెంట్ ఇన్‌స్టా లేని స్మార్ట్ ఫోన్ ఉందంటే నమ్మడం కష్టం. కామన్ మ్యాన్ నుంచి సెలబ్రెటీస్ వరకు ప్రతి ఒక్కరు ఇన్‌స్టా వాడుతున్నారు. ముఖ్యంగా సినీ సెలబ్రిటీల కెరీర్‌ కూడా సోషల్ మీడియాలో పాపులారిటీని బట్టే యూటర్న్ తిరుగుతున్నాయి అనడంలో సందేహం లేదు. అందుకే ఇన్‌స్టా ఫాలోవర్ లిస్టు కూడా ఓ స్టేటస్ గా భావిస్తున్నారు సెలబ్రెటీస్.

సౌత్ నుంచి నార్త్ వరకు చాలామంది స్టార్ హీరో, హీరోయిన్‌లు ఇన్‌స్టా వాడుతూ పాపులారిటీ తో పాటు.. బ్రాండ్స్ ప్రమోట్ చేస్తూ మనీ కూడా సంపాదిస్తున్నారు. అయితే ఇండియాలో ఇప్పటివరకు ఇన్‌స్టాలో నెంబర్ 1 స్టార్ గా ఉన్న సెలెబ్రిటీ ఎవరంటే ప్రియాంక చోప్రా పేరే వినిపిస్తుంది. ఇండియాతో పాటు ఇండియా బయట కూడా ఇప్పటివరకు మొత్తం 89.7 మిలియన్ కోట్ల మంది ఫాలోవర్స్‌ను ప్రియాంక ఆక‌ట్టుకుంది. ఇక శ్రద్ధ కపూర్.. తర్వాత ఆలియా భట్ 80.2 మిలియన్ ఇన్‌స్టా ఫాలోవెర్స్‌తో టాప్ 3 ప్లేస్ లో కొనసాగుతున్నారు.

దీపికా పదుకొనే 76.5 మిలియన్ మంది ఫాలోవర్స్‌ను సంపాదించుకున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఇలా ఇన్‌స్టా ఫాలోవర్స్ లో టాప్ లిస్టులో ఉన్న స్టార్ సెలబ్రిటీస్ అందరినీ వదిలేసి మరి కేవలం ఆ యంగ్ హీరో ఒక్కడినే ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలో అవుతోంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజంగా జరిగింది. ఇండియా మొత్తంలో బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌశల్‌ను మాత్రమే ఇన్‌స్టా ఫాలో అవుతుంది. దీంతో ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైర‌ల్‌ అవుతుంది.