“మీకేంట్రా నొప్పి”..స్టేజిపై కోపంతో ఊగిపోయిన సుమ కొడుకు .. అర్జున్ రెడ్డి కి తమ్ముడు లా ఉన్నాడే..!

సినిమా ఇండస్ట్రీలోకి కొత్తగా వస్తున్న హీరోల లిస్ట్ పెరిగిపోతుంది . సినిమా ఇండస్ట్రీ చాలా పెద్దది కావడం విశాలమైన హృదయంతో జనాలు కొత్త కొత్త వాళ్ళని ఆదరిస్తూ ఉండడంతో యంగ్ జనరేషన్ ఇండస్ట్రీలోకి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది . రీసెంట్ గా టాలీవుడ్ స్టార్ యాంకర్ సుమ కొడుకు రోషన్ ఇండస్ట్రీలోకి హీరోగా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. కొత్త దర్శకుడి దర్శకత్వంలో “బబుల్గం” అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు .మానస హీరోయిన్గా చేస్తుంది. రవికాంత్ పేరపు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమా ఈ నెల 29న రిలీజ్ కాబోతుంది . ఈ క్రమంలోని సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆదివారం సాయంత్రం హైదరాబాద్లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్గా నిర్వహించారు మేకర్స్ . ఈ కార్యక్రమానికి అడవి శ్Zఏష్, సిద్దు జొన్నలగడ్డ వంటి వారు గెస్ట్లుగా వచ్చి రోషన్ ని ఎంకరేజ్ చేశారు . అంతవరకు బాగానే ఉన్నా స్టేజి పైకి వచ్చిన రోషన్ కూసింత అగ్రేసివ్ గా స్పీచ్ ఇవ్వడం అభిమానులకి షాకింగ్ గా అనిపించింది.

ఆయన మాట్లాడుతూ ..”నేను నల్లగా ఉన్నాను అంటూ నాపై చాలామంది కామెంట్లు చేశారు ..నా వెనకాలే నాది హీరో మెటీరియల్ కాదు అంటూ అవహేళన చేశారు. కర్రెగా ఉన్నాడు వీడు హీరో ఏంట్రా బాబు అంటూ దారుణంగా మాట్లాడారు. స్వయంగా నేనే ఆ మాటలు విన్నాను . చాలా ఆర్టికల్స్ చదివాను . చాలా ట్రోల్స్ చూశాను. మీమ్‌స్ చూశాను. అయితే ఒకటే చెప్తున్నా తెలుపు నలుపు అనేది సక్సెస్ కి ఎప్పుడు బానిస కాదు . టాలెంట్ ఉండాలి హార్డ్ వర్క్ చేయాలి అదే ఇండస్ట్రీలో మనల్ని నిలబడుతుంది “.

“ఒకటి గుర్తు పెట్టుకోండి బ్రదర్స్ సక్సెస్ ని డిసైడ్ చేసేది మనిషి హార్డ్ వర్క్ ..రంగు కాదు మన అందరి జాతకంలో ఏం రాసిపెట్టిందో ఎవరికీ తెలియదు ..అదే జరుగుతుంది కావాల్సింది తెచ్చుకోవడానికి దక్కించుకోవడానికి కష్టపడాలి అంటూ కూసింత ఘాటుగా ఓవర్గానే మాట్లాడాడు”. దీంతో ఫస్ట్ సినిమాకి ఈ రేంజ్ లో అగ్రిసివ్ నెస్ చూపిస్తున్నావు అర్జున్ రెడ్డి బ్రదరా అంటుంటే.. మరికొందరు వాడి ఇష్టం వాడికి నచ్చింది మాట్లాడుతాడు .. నచ్చింది చేసుకుంటాడు మధ్యలో మీకేంటి రా నొప్పి” అంటూ సుమ ఫ్యాన్స్ రోషన్ ని సపోర్ట్ చేస్తున్నారు.