వావ్: మళ్ళీ వర్షం కాంబో రిపీట్.. ప్రభాస్-త్రిష-గోపీచంద్ తో ఆ స్టార్ డైరెక్టర్ సినిమా ఫిక్స్..!

ఇది నిజంగా రెబెల్ అభిమానులకు వెరీ వెరీ గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్న కాంబో మళ్లీ తెరపై సెట్ అవుతుందా..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ హీరోగా పేరు సంపాదించుకున్న ప్రభాస్ – గోపీచంద్ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతుంది అన్న వార్త ఇప్పుడు అభిమానులకు కొత్త ఊపునిస్తుంది.

వర్షం సినిమాలో ప్రభాస్ హీరోగా గోపీచంద్ విలన్ గా త్రిష హీరోయిన్ గా కనిపించారు. ఆ తర్వాత వీళ్ళ కాంబోలో అసలు సినిమానే రాలేదు . ఈ క్రమంలోనే ఈ క్రేజీ కాంబో ని సెట్ చేసే పనిలో బిజీగా ఉన్నాడట సందీప్ రెడ్డివంగా. ప్రభాస్తో సందీప్ రెడ్డి వంగ ఓ సినిమాను తెరకెక్కించాలి అని డిసైడ్ అయిన విషయం తెలిసిందే.

 

స్పిరిట్ అనే పేరుతో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమాలో విలన్ గా గోపీచంద్ ను చూస్ చేసుకున్నాడట సందీప్ రెడ్డి వంగా. గోపీచంద్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఓకే చేసినట్లు తెలుస్తుంది. హీరోయిన్ గా త్రిష ను ఫైనలైజ్ చేశారట. మళ్లీ ఇన్నాళ్లకి త్రిష-ప్రభాస్-గోపిచంద్ కాంబో రాబోతుండటంతో ఫ్యాన్స్ ఎక్సైట్ అవుతున్నారు..!!