రాజకీయాలోకి ఎంట్రీ ఇవ్వబోతున్న అనిల్‌ రావిపూడి.. ఇంట్రెస్టింగ్‌ (వీడియో) వైరల్..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . డైరెక్టర్ అనిల్ రావిపూడి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడా..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . అయితే అది ఒరిజినల్ రాజకీయాలు కాదు ఫన్నీగా ఒక గేమ్ షో ని డిజైన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా తో కలిసి అనిల్ రావిపూడి ఫన్నీ గేమ్ ను డిజైన్ చేసినట్లు తెలుస్తుంది .

దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది . ఇన్నాళ్లు దర్శకుడు గా తనను ప్రోత్సహించారు అని.. విజయాలు అందించి సక్సెస్ చేశారు అని.. తన సక్సెస్ కి మీరే కారణం అంటూ చెప్పుకొచ్చాడు అనిల్ రావిపూడి . ఇకపై కొత్త రంగంలోకి అడుగు పెట్టాలనుకుంటున్నట్లు చట్టసభల్లోకి వెళ్లాలని భావిస్తున్నట్లు తెలిపారు . సినిమాలో ఆదరించినట్లే రాజకీయాలలోనూ తన ఎంకరేజ్ చేయాలని ఆయన ఈ వీడియోలో చెప్పడం గమనార్హం.

 

ఈ వీడియోలో అనిల్ రావిపూడి మాట్లాడుతూ ..”నేను డైరెక్ట్ చేశాను మీరు హిట్ చేశారు ..నేను ఎంటర్టైన్ చేశాను మీరు ఎంటర్టైన్ అయ్యారు .. గెలిచేది నేనేనైనా గెలిపించేది మీరే.. ఈసారి నా గెలుపు థియేటర్లో కాదు అసెంబ్లీలో ..ఓ అసెంబ్లీ ఓ పార్లమెంట్ ఇలా ప్లాన్ చేసుకుంటున్నాను” అంటూ ఇంట్రెస్టింగ్ మాటలతో అభిమానులను కట్టిపడేశాడు . అందరికీ తెలిసిందే ఇది ఒరిజినల్ రాజకీయం కాదు గేమ్స్ రాజకీయం . ఓ గేమ్ షో ని ఇలా డిజైన్ చేసినట్లు తెలుస్తుంది . దీంతో సోషల్ మీడియాలో అనిల్ రావిపూడి కి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది..!!