‘ మంగళవారం ‘ సక్సెస్.. మరో మూవీ ఛాన్స్ కొట్టేసిన పాయల్.. ఆ స్టార్ హీరో తో

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆర్ఎక్స్ 100 సినిమాతో అడుగుపెట్టింది స్టార్‌ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్. మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ సక్సెస్ తో పాటు బోల్డ్ ఇమేజ్ ని కూడా సొంతం చేసుకుంది. మొదటి సినిమాతోనే ప్రేక్షకులు కావాల్సినంత బోల్డ్‌ కంటెంట్ అందించింది. దీంతో ఈమెకు తర్వాత పెద్దగా హీరోయిన్ అవకాశాలు ఏమీ రాలేదు. త‌ర్వాత‌ ఇండస్ట్రీకి దూరమైన ఈ ముద్దుగుమ్మ మళ్ళీ ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి ఇచ్చిన అవకాశాన్ని చేజాక్కించుకొని.. మంగళవారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈరోజు రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ ను అందుకుంది.

First Look Poster of Payal Rajput's 'Mangalavaaram' Unveiled

దీంతో ఈమెకు ప్రస్తుతం వరుస అవకాశాలు క్యూ క‌డుతున్నాయట‌. ఈ నేపథ్యంలోనే పాన్ ఇండియా స్టార్ హీరో అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబోలో రూపొందుతున్న సినిమాలో ఈమెకు ఓ లీడ్‌రోల్‌లో నటించే అవకాశం వ‌చ్చిందంటూ న్యూస్ వినిపిస్తుంది. ఇక గతంలో స్టార్ హీరో వెంకటేష్ పక్కన వెంకీ మామ సినిమాలో నటించినా ఆమెకు పెద్దగా సక్సెస్ రాలేదు. దీంతో ఆమెకు పెద్ద హీరోల సినిమాల్లో కూడా అవకాశాలు దక్కలేదు. ఇక ఇవాళ రిలీజ్ అయిన మంగళవారం సినిమాకు పాజిటివ్ టాక్ అందుకోవడంతో పాయల్ కు అల్లు అర్జున్ త్రివిక్రమ్ మూవీ లో క్రేజీ ఆఫర్ రావడం నిజంగా ఆమె లక్ అనే చెప్పాలి.

Payal Rajput with Allu Arjun : "Taggede Le" | Payal Rajput with Allu Arjun  : "Taggede Le"

ఇక తాజాగా జరిగిన మంగళవారం ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌లో కూడా అల్లు అర్జున్ సందడి చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఆమెకు త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న పాన్ ఇండియా మూవీలో అవకాశం ఇచ్చినట్లు వివరించాడట. ఈ సినిమాలో అవకాశం రావడం.. మంగళవారం మూవీ కూడా హిట్ అవ్వడంతో.. ఈమెకు ఒకేసారి రెండు గుడ్ న్యూస్ లు వినిపించాయి. ఇక అదే విధంగా తమిళ్‌లో పెద్ద హీరోల సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయట. తెలుగు, తమిళ రెండు ఇండస్ట్రీలోనూ ఆమె ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ క్రేజీ హీరోయిన్ గా మారింది అంటూ న్యూస్ వినిపిస్తుంది.