శారీ లో మెరిసిన నేషనల్ క్రష్ రష్మిక….క్యూట్ లుక్ వైరల్!

ప్రస్తుతం దేశమంతటా తన సినిమాను ప్రమోట్ చేసే పనిలో ఉంది నేషనల్ క్రష్ రష్మిక మందన్న. సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రన్బీర్ కపూర్, రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం “యానిమల్”. ప్రతినాయకుడిగా బాబీ డియోల్ నటిస్తున్న ఈ చిత్రంలో, అనిల్ కపూర్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం డిసెంబర్ 1 న విడుదలకు సిద్ధమవుతుంది. యానిమల్ టీం ఇప్పుడు ప్రమోషన్స్ లో భాగంగా దేశమంతటా ప్రెస్ మీట్ లలో పాల్గొంటున్నారు.


యానిమల్ ప్రమోషన్స్ లో సెంటర్ అఫ్ అట్రాక్షన్ గా నిలుస్తుంది రష్మిక. నవంబర్ 24 న ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగానే ఆహా లో అన్ స్టోప్పబుల్ కార్యక్రమంలో ప్రత్యక్షమయ్యారు యానిమల్ టీం. ఈ షో కు ఒక బ్లాక్ శారీ, స్లీవ్ లెస్ బ్లౌజ్ లో దర్శనమిచ్చింది రష్మిక. ఈ లుక్ లో ఆమె ఫోటోలు తెగ వైరల్ అయ్యాయి. ఇప్పుడు తాజాగా చెన్నై లో జరిగిన మరో ఈవెంట్లో మళ్ళీ తన క్యూట్ తో అదరగొట్టింది రష్మిక. గ్రీన్ శారీ, స్లీవ్ లెస్ బ్లౌజ్ తో ప్రత్యక్షమయింది ఈ బ్యూటీ. తన మైండ్ బ్లోయింగ్ లుక్ తో అందర్నీ మంత్రముగ్దుల్ని చేసింది రష్మిక. ఈ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. చెన్నై లో ఈవెంట్ అనంతరం యానిమల్ టీన్ కర్ణాటక చేరుకుంది. తన సొంత గడ్డ పై మరింత హడావిడి చేస్తుంది రష్మిక. తన అభిమానులను సొంత భాషలో పలకరిస్తూ సందడి చేసింది. ఇంట్రెస్టింగ్ స్పీచ్ తో అందర్నీ ఆకట్టుకుంది.

రష్మిక ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీ గా ఉంది. యానిమల్ చిత్రం అనంతరం రష్మిక “పుష్ప 2” , “రైన్ బో” చిత్రాలలో నటింస్తుంది. ఈ చిత్రాలు కూడా షూటింగ్ చివరి దశలో ఉన్నాయి. పుష్ప 2 చిత్రం 2024, ఆగష్టు 15 న విడుదల చేస్తామని ఇప్పటికే ప్రకటించారు మేకర్స్.