ఆసక్తి రేపుతున్న ‘ కాంతార చాప్టర్ 1 ‘ ఫస్ట్ లుక్ వీడియో.. రిషబ్ శెట్టి ఉగ్రరూపం చూశారా..

కన్నడ సినీ ఇండస్ట్రీకి ఓ కొత్త వైభ‌వాని తెచ్చిపెట్టిన‌ మూవీ కాంతారా. ఈ సినిమా ద్వారా రిషబ్ శెట్టి నటుడిగా మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు. దర్శకుడుగా పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్‌ తెచ్చుకున్నాడు. భాషతో సంబంధం లేకుండా ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. రిలీజ్ అయిన అన్ని భాషల్లోనూ సినిమా రికార్డుల స్థాయిలో కలెక్షన్లను కొల్లగొట్టింది.

హెంబాలే ఫిలిం నిర్మించిన ఈ సినిమా భారత దేశ వ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా గ్రాస్ వ‌సులను సొంతం చేసుకుంది. ఈ సక్సెస్‌ని స్ఫూర్తిగా తీసుకున్న రిషబ్ శెట్టి దీనికి సీక్వెల్ చేయడానికి నిర్ణయించుకున్నాడు. ఇక ఇటీవల స‌ప్త‌సాగ‌రాలు దాటి సినిమాతో మంచి స‌క్స‌స్ అందుకున రిష‌బ్‌.. కాంతారా చాప్టర్ 1తో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. ఇటీవ‌ల ఈ మూవీ ఫ‌స్ట్ గ్లింప్స్‌ వీడియోను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు.

ఇందులో రిషబ్ శెట్టి చేతిలో త్రిశూలం పట్టుకుని ఉగ్రరూపంలో కనిపించాడు. ఇక పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా ఏడు భాషల్లో రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం ఈ వీడియోను చూసిన వారంతా రిషబ్ శెట్టి చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు అంటూ.. శివుని ఉగ్ర‌రూపం ఇలాఉంటుందా అన్న‌ట్లు ఉన్నాడంటూ.. ఈ సీక్వెల్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూన్నామంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.