సలార్ సినిమాపై హైప్ పెంచేసిన రాఖీ బాయ్..!!

టాలీవుడ్ లో మోస్ట్ అవైడెడ్ సినిమా ఏది అంటే ప్రతి ఒక్కరు కూడా సలార్ సినిమా నే అని చెబుతూ ఉంటారు.. పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన ఈ సినిమాని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు.. అంతేకాకుండా హోంబలే ఫిలిం బ్యానర్స్ వారు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తూ ఉండడంతో ఈ సినిమా పైన భారీగా అంచనాలు చేరిపోయాయి. హీరోయిన్గా శృతిహాసన్ నటించిన మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నారు..

అలాగే జగపతిబాబు కూడా కీలకమైన పాత్రలో నటించడం జరుగుతోంది. గతంలో కూడా శృతిహాసన్ జగపతిబాబు సైతం సలార్ సినిమా పైన పలు వ్యాఖ్యలు చేస్తూ ఈ సినిమాకి మంచి హైప్ వచ్చేలా చేశారు.. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించి పలు రకాల అప్డేట్లను సైతం విడుదల చేస్తూ ఉన్నారు చిత్ర బృందం. డిసెంబర్ 22వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఇలాంటి తరుణంలో హీరో యశ్ మాట్లాడుతూ.. సలార్ సినిమాకి మరింత హైప్ పెంచేసినట్టుగా తెలుస్తోంది.

యశ్ మాట్లాడుతూ ప్రశాంత్ నీల్ నాకు చెప్పిన దాంట్లో కేజిఎఫ్ అనేది చాలా చిన్న భాగము మాత్రమే అంతకు మించింది ప్రశాంత్ దగ్గర చాలానే ఉన్నదని తెలిపారు.. అందుకు డైరెక్టర్ ప్రశాంత్ కూడా ఒప్పుకోవడం జరిగింది. అయితే హీరో యశ్ చెప్పింది సలార్ సినిమా గురించే అంటూ పలువురు అభిమానులు తెలుపుతున్నారు. ఈ సినిమా కేజిఎఫ్ ను మించి ఉంటుంది అంటూ డైరెక్టర్ కూడా ఇది వరకే హీట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు యశ్ చెప్పడంతో ఈ సినిమాకి మరింత ప్లస్ గా మారుతోంది.