ఉపాసన, చరణ్ కి పెళ్లయి పదేళవుతున్న ఆ విషయంలో మాత్రం సపరేట్‌గానే ఉంటారా.. బయటపడ్డ సీక్రెట్‌..!!

మెగాస్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం ” గేమ్ చేంజర్ ” సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. అనంతరం సుకుమార్, ప్రశాంత్ నీల్, లోకేష్ కనగరాజ్.. వంటి బడా డైరెక్టర్స్ దర్శకత్వంలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేయనున్నాడు. ఇక రామ్ చరణ్ సినిమాలకు ఎంత ప్రయారిటీ ఇస్తాడో తన ఫ్యామిలీకి కూడా అంతే ప్రయారిటీ ఇస్తాడు. ఇక ఉపాసనను ప్రేమించి పెళ్లి చేసుకొన్న విషయం తెలిసిందే.

ఇటీవలే అపోలో ఆసుపత్రిలో పండంటి ఆడ‌బిడ్డకు కూడా జన్మనిచ్చారు. ఈ విషయంలో ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి సంతోషానికి హద్దులు లేవు. ఇక చరణ్, ఉపాసన పెళ్లై పదేళ్లు దాటుతున్న డబ్బుల విషయంలో మాత్రం చాలా స్ట్రిక్ట్ గా ఉంటారంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. అలాగే ఎవరు ఎలాంటి సోషల్ సర్వీస్ చేయాలన్న వాళ్ళ మనీతోనే చేస్తారట.

ఒకరు డబ్బులు మరొకరు ఖర్చు చెయ్యరట. ఉపాసన, చరణ్ డబ్బుల విషయంలో మాత్రం చాలా స్ట్రిక్ట్ గా లెక్కలను ఫాలో అవుతారట. ఈ వార్త చూసిన ప్రేక్షకులు…” వేలకోట్ల ఆస్తి ఉన్న ఇలాంటి అలవాట్లు ఉండటం ఏంటి? ” అంటూ కామెంట్లు చేస్తున్నారు. మెగా ఫ్యాన్స్ మాత్రం రూపాయి విలువ తెలిసిన వాళ్లు కాబట్టి ఇలా ఖర్చు పెడుతున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.