చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి మహానటిగా ఎదిగిన కీర్తి సురేష్… విజయవంతంగా పదేళ్లు పూర్తి చేసుకుంది గా…!!

మలయాళ బ్యూటీ కీర్తి సురేష్ మనందరికీ సుపరిచితమే. ఈ బ్యూటీ సినీ కెరీర్ లో అడుగుపెట్టి నేటితో పదేళ్లు గడిచాయి. వారసత్వంతో ఫిలిం ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చినా.. తనకంటూ సొంత ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో నటించి మెప్పించింది. అనంతరం మలయాళం లో 2013లో గీతాంజలి సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది.

ఇక తెలుగులో ” నేను శైలజ ” సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి.. ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది. అనంతరం పవన్ కళ్యాణ్, చిరంజీవి, మహేష్ వంటి అగ్ర హీరోల సరసన నటించింది. ఇక మహానటి సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాలో కీర్తి సురేష్ నటించిన నటన అంతా ఇంతా కాదు.

సావిత్రి కి ఏ మాత్రం తీసిపోకుండా కీర్తి సురేష్ నటించింది. ఈ సినిమాలో కీర్తి సురేష్ నటనకు గాను జాతీయ ఉత్తమ అవార్డు కూడా దక్కింది. ఇక ఈ బ్యూటీ సినీ కెరీర్ లో అడుగుపెట్టి ఈరోజుకు (నవంబర్ 15 ) పదేళ్లు పూర్తయ్యాయి. ఇక ముందు ముందు మరిన్ని సినిమాలతో దూసుకుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అంటూ ప్రేక్షకులు సైతం కామెంట్లు చేస్తున్నారు.