మరో భారీ ప్రాజెక్టు వైపు అడుగులు వేస్తున్న అట్లీ.. ముగ్గురు స్టార్ హీరోస్ తో మూవీ..

సినీ ఇండస్ట్రీలో అతి తక్కువ సినిమాలతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయిన వారిలో అట్లీ ఒకడు. తన నాలుగో సినిమాతోనే పాన్ ఇండియా డైరెక్టర్గా మారిన అట్లి.. డైరెక్ట‌ర్‌ శంకర్ శిష్యుడుగా తనదైన గుర్తింపు సంపాదించుకున్నాడు. రాజారాణి సినిమాతో డైరెక్టర్ గా మారిన అట్లీ ఈ సినిమా సక్సెస్ అందుకోవడంతో విజయ్ హీరోగా మెర్సల్‌, బిగిల్ సినిమాలను రూపొందించాడు. ఈ సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఇక నాలుగో సినిమాగా బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ మూవీ ని తుర‌కెక్కించాడు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పుడు తన ఐదో సినిమా ఎవ‌రితో ఉంటందో.. కథ ఏ రేంజ్ లో ఉండబోతుందో అనే అంశంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్ప‌డ్డాయి.

జవాన్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత షారుక్‌ ఖాన్ మళ్లీ అట్లీ డైరెక్షన్లో నటించడానికి రెడీగా ఉన్నారు. నటుడు విజయ్ కూడా షారుక్ ఖాన్ తో కలిసి నటించినందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీంతో వీరిద్దరిని కలిపి ఓ మల్టీ స్టార‌ర్ మూవీ చేయడానికి అట్లీ సిద్ధమైనట్లు ఇంటర్వ్యూలో వివరించాడు. అలాంటిది ఇప్పుడు కొత్తగా లోకనాయకుడు కమల్ హాసన్‌ను కూడా అట్లీ కలిశాడు. దీంతో ప్రస్తుతం ఈ న్యూస్‌ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కమలహాసన్ కు అట్లీ కథ చెప్పినట్లు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అంతేకాకుండా కమలహాసన్ రెమ్యూనరేషన్ తదితర విషయాల గురించి కూడా మాట్లాడినట్లు త్వరలోనే అగ్రిమెంట్ పై సైన్ చేయబోతున్నట్లు సమాచారం. ఇక విజ‌య్ , షారుక్‌తో క‌మ‌ల్ కూడా నటించనున్నారా.

లేదా అట్లీ డైరెక్షన్లో హాలీవుడ్ ఇండస్ట్రీ నిర్మిస్తున్న మరో సినిమాలో కమల్ హాసన్ నటిస్తున్నారా అనే అంశంపై క్లారిటీ రాలేదు. కాగా ప్రస్తుతం కమలహాసన్ బిగ్ బాస్ రియాల్టీ గేమ్ షో లో హోస్ట్గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఓ పక్కన బిగ్ బాస్ లో ఉంటూనే మరో పక్క ప‌లు సినిమాలతో బిజీగా గడుపుతున్న కమల్ హాసన్ ప్రస్తుతం ఇండియన్ 2 సినిమా పూర్తి చేసాడు. తర్వాత రాబోయే ఇండియన్ 3 సినిమాకు రెడీ అవుతున్నాడు. ఇక దీంతో పాటే తెలుగులో నాగఅశ్విన్‌ డైరెక్షన్లో వస్తున్న కల్కి 2898 సినిమాల్లో నటిస్తున్నాడు. ఇందులో విలన్ పాత్రలో పవర్ ఫుల్ గా కనిపించనున్నాడు. తన 233వ సినిమాను వినోద్ హెచ్.. డైరెక్షన్ లో, 234వ సినిమాను మణిరత్న డైరెక్షన్లో నటించడానికి రెడీ అయ్యాడు. ఇక అట్లి డైరెక్షన్లో కమలహాసన్ నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన న్యూస్ నిజమైతే ఇది అతని 235వ సినిమా అవుతుంది.