స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరో అయిపోయాడు బన్నీ. తన నటనతో ఎంతోమంది అభిమానులని దక్కించుకున్నాడు. ఏకంగా బిగ్ బి అమితాబ్ బచ్చన్ తన ఫేవరెట్ యంగ్ స్టార్ అని చెప్పే స్థాయికి ఎదిగాడు.
ఇదిలా ఉంటే..”రెడ్ బస్, ఫ్రూటీ, జొమాటో ” లాంటి పలు బ్రాండ్స్ కు అంబాసిడర్ గా ఉన్న ఈయన… ” పుష్ప ” ఎఫెక్ట్‌తో రెమ్యూనరేషన్ పెంచేసినట్లు సమాచారం. ఇప్పటివరకు రూ. 35 లక్షలు తీసుకున్న బన్నీ.. ప్రస్తుతం 6 కోట్లు డిమాండ్ చేస్తున్నాడని ఇండస్ట్రీలో టాక్.
కాగా దీనిపై స్పందించిన అల్లు అర్జున్ ఫ్యాన్స్.. ఇదంతా ఫేక్ అని కొట్టి పడేస్తున్నారు. ఒక యార్డ్ కు ఇంత పెద్ద మొత్తంలో చెల్లిస్తే కంపెనీ క్లోజ్ చేయాల్సి వస్తుంది.. అంటూ ఫైర్ అవుతున్నారు. మరి కొంతమంది మాత్రం.. ” ఈయనకి సినిమాల కంటే ఇదే బాగున్నట్టుందిగా… గట్టి మొత్తంలోనే రాబడుతున్నాడు “అంటూ కామెంట్లు చేస్తున్నారు.