మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తాజాగా దీపావళి సందర్భంగా గ్రాండ్ గా ఓ పార్టీ చేసుకున్న సంగతి తెలిసిందే. చరణ్ ఈ వేడుకకు టాలీవుడ్ స్టార్స్ అందరిని ఆహ్వానించాడు. ఈ నేపథ్యంలో మహేష్, ఎన్టీఆర్, వెంకటేష్, అల్లు అర్జున్ లాంటి స్టార్స్ హాజరయ్యారు.
అలాగే చరణ్ కుమార్తె మెగా ప్రిన్స్ కోసం పలువురు స్టార్స్ వివిధ రకాల బహుమతులు సైతం తెచ్చారు. ఇందులో టాయ్స్ గిఫ్ట్ లో పలు రకాల బొమ్మలు ఉన్నాయని అయితే ఇవి ఐదు సంవత్సరాల పాటు ఆడుకునే విధంగా ఉపయోగపడతాయని సమాచారం.
ఇక అందరికన్నా స్పెషల్ గా చరణ్ బెస్ట్ ఫ్రెండ్ జూనియర్ ఎన్టీఆర్ క్లీంకార కోసం ఓ కాస్ట్లీ గిఫ్ట్ తీసుకొచ్చాడట. ఆ బహుమతిని తారక్ సతీమణి లక్ష్మీ ప్రణతి దగ్గరుండి మరి సెలెక్ట్ చేసిందట. ఈ గిఫ్ట్ ఏంటో తెలియదు కానీ.. అందరికన్నా తారక్ తీసుకున్న గిఫ్ట్ మాత్రం చాలా కాస్ట్లీ అని సోషల్ మీడియాలో ఓ వార్త ప్రచారం అవుతుంది.