యూట్యూబ్ రివ్యూ లతో ల‌క్ష‌లో సంపాదిస్తున్న బిగ్ బాస్ ఆది.. నెల సంపాద‌నే అన్ని ల‌క్ష‌లా ..!!

బిగ్ బాస్ సీజన్ 6 లో కంటిస్టెంట్ గా పాల్గొని.. నాలుగో స్థానం దక్కించుకున్నాడు ఆదిరెడ్డి. సీజన్ 7 మొదలు కాగా.. ఈయన వరుస రివ్యూ వీడియోలు చేస్తున్నాడు. లైవ్ తో పాటు ప్రోమోలు, ఎపిసోడ్స్ చూస్తూ ఆదిరెడ్డి రివ్యూలు చెబుతున్నాడు. తనకు అనిపించింది మంచో.. చెడ్డో చెబుతూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో కొందరిని విమర్శించడం, మరి కొంతమందిని పొగడడం చేయడంతో డబ్బులు బాగానే వస్తున్నాయి.

తాజాగా వీటన్నిటిపై ఆదిరెడ్డి స్పందించి తన యూట్యూబ్ ఆదాయం బయటపెట్టాడు. ఆది రెడ్డి మాట్లాడుతూ…” అవును నేను పేయిడ్ రివ్యూవర్ నే. నాకు యూట్యూబ్ పే చేస్తుంది. ఈనెల నాకు రూ. 39 లక్షల ఆదాయం వచ్చింది ” అంటూ విమర్శలపై మండిపడ్డాడు. అంటే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఏడాది సంపాదనను ఆదిరెడ్డి ఒక నెలలో సంపాదిస్తున్నాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఆది రెడ్డికి బిగ్ బాస్ లోకి వెళ్ళకముందు ఇంత మొత్తంలో డబ్బు ముట్టేది కాదు. కానీ అలా బిగ్ బాస్ లో అడుగు పెట్టాడో లేదో ఇలా లక్షల వర్షం కురుస్తుంది. ఏదేమైనా ఆదిరెడ్డి లక్కీ అనే చెప్పాలి. ప్రస్తుతం ఆదిరెడ్డి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.