చిట్ చాట్ లో డబ్బులు డిమాండ్ చేసిన అభిమాని. … సుప్రీమ్ హీరో సమాధానం ఏమిటంటే?

మెగా ఫామిలీ బ్యాక్ గ్రౌండ్ తో సినీ పరిశ్రమలో అడుగుపెట్టి, తక్కువ సమయంలోనే తనకంటూ పరిశ్రమలో ఒక ప్రత్యేక స్తానం ఏర్పరుచుకున్నాడు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్. తాను నటించిన మొదటి చిత్రం “పిల్లా నువ్వులేని జీవితం” చిత్రంతోనే అద్భుతమైన విజయం సాధించి ప్రేక్షకులను మెప్పించాడు. ఈ చిత్రంలో సాయి ధర్మ తేజ్ నటన, డాన్స్ అందర్నీ ఆకట్టుకున్నాయి. తరువాత సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీమ్, చిత్రలహరి, విరూపాక్ష, రిపబ్లిక్ వంటి సూపర్ హిట్ చిత్రాలలో నటించి ఎందరో అభిమానులను సంపాదించుకున్నాడు. లవ్ స్టోరీ, ఫామిలీ ఎంటర్టైనర్, కామెడీ, ఫాంటసీ. … ఇలా ప్రతి కళా ప్రక్రియ లోను చిత్రాలు చేస్తూ తన అభిమానులను మెప్పిస్తున్నాడు.

ఐతే అసలు విషయం ఏమిటంటే సాయి ధరమ్ తేజ్ నటించిన మొదటి చిత్రం “పిల్లా నువ్వులేని జీవితం” విడుదలయ్యి నవంబర్ 14 కి 9 ఏళ్ళు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సాయి ధరమ్ తేజ్ తన అభిమానులతో #AskSDT పేరుతో ఒక ఆన్లైన్ చిట్ చాట్ సెషన్ లో పాల్గొన్నారు. ఈ చిట్ చాట్ లో అభిమానులు అతన్ని రకరకాల ప్రశ్నలు అడిగారు. ఐతే ఒక నెటిజన్ మాత్రం ఎవ్వరు ఊహించని విధంగా తనకు అర్జెంట్ గా 10 లక్షల రూపాయలు కావాలంటూ సాయి ధరమ్ తేజ్ ను అడిగాడు. అందరు అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఎంతో ఓపికగా సమాధానం ఇచ్చిన సాయి ధరమ్ తేజ్, ఈ క్లిష్టమైన పరిస్థితి నుంచి చాలా సున్నితంగా తప్పించుకున్నాడు. సినిమాటిక్ డైలాగులు వేసి అనవసరమైన కాంట్రవశీలకు దారితీయకుండా, బ్రహ్మానందం నవ్వుతున్నట్టు ఒక మీమ్ షేర్ చేసి ఊరుకున్నాడు.

చిట్ చాట్ విషయానికొస్తే, ఫాన్స్ అడిగిన అన్ని ప్రశ్నలకు చాలా ఓపికగా సమాధానం ఇచ్చారు సాయి ధరమ్ తేజ్. కొన్ని ప్రశ్నలకు కాసంత చమత్కారం కూడా జోడించారు. పెళ్లి ఎప్పుడు అని ఒక అభిమాని ప్రశ్నించగా, మీ పెళ్లి అయిన వెంటనే చేసుకుంటా బ్రదర్ అని సమాధానం ఇచ్చారు. మావయ్య పవన్ కళ్యాణ్ గురించి ఒక్క మాటలో చెప్పండి అని మరో అభిమాని అడిగిన ప్రశ్నకు “గురువు” అని సమాధానం ఇచ్చారు. చిన్న మావయ్యతో నటించారు, మరి పెద్ద మావయ్య తో ఎప్పుడు సినిమా చేస్తారు అని అడగగా, ఒక మంచి కథ వస్తే ఎప్పుడైనా రెడీ అంటూ సమాధానం ఇచ్చారు సాయి ధరమ్ తేజ్.