” సుందరకాండ ” సినిమా హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..‌. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…!!

కొంతమంది నటీనటులు ఒకటి, రెండు సినిమాలు చేసినప్పటికీ ప్రేక్షకుల మనసులలో నిలిచిపోతారు. అలా గుర్తుండిపోయే హీరోయిన్లలో ” సుందరకాండ ” సినిమాలో సెకండ్ హీరోయిన్ ఒకరు. అయితే ఈ పాత్ర కోసం రాఘవేంద్రరావు ఓ స్టార్ హీరోయిన్ ను తీసుకోవాలని అనుకున్నారట. చివరికి కొత్త అమ్మాయి అయితే బాగా సెట్ అవుతుందని.. భావించి అపర్ణని తీసుకున్నారట. ఇక ఒక రోజు రాఘవేంద్రరావు నిర్మాత కె వి వి సత్యనారాయణ ఇంటికి వెళ్లి ఆయనకు ఓ అమ్మాయి బాగా నచ్చిందని.. ఆ అమ్మాయి అయితే సినిమాలో నీ పాత్రకి బాగా సెట్ అవుతుందని.. భావించి రాఘవేంద్రరావు గారు ఆ అమ్మాయిని ఫైనల్ అనుకున్నారట.

సరిగ్గా పది రోజుల తరువాత సినిమా కోసం జరిగినటువంటి ఆడిషన్స్ కు ఆ అమ్మాయి కూడా హాజరయ్యింది. దీంతో అక్కడున్న వారిని రాఘవేంద్రరావు ఈ అమ్మాయి ఎవరు అని అడిగారు. అక్కడ అసిస్టెంట్ ఈమె సత్యనారాయణ మేనకోడలు సార్ ఆమె పేరు అపర్ణ అని చెప్పారట. ఇదే సమయంలో రాఘవేంద్రరావు ఆమెను ఓకే చేశారట. ఇక అపర్ణాకు అసలు యాక్టింగ్ వచ్చా? రాధా? అని మొదట్లో చాలా టెన్షన్ పడ్డారట. కానీ షూటింగ్లో ఆమె అద్భుతమైన నటను చూసి ఆశ్చర్యపోయారట.

ఇక ఈ సినిమా అనంతరం అపర్ణాకు అనేక సినిమాల ఆఫర్లు వచ్చాయట. కానీ వారి కుటుంబ సభ్యులకు హీరోయిన్గా చేయడం ఇష్టం లేక సినిమాలలో నుంచి తప్పించారు. కానీ దాసరి నారాయణ రావు ” అక్క పెత్తనం చెల్లి కాపురం ” అనే సినిమాలో చివరిసారిగా నటించింది. తర్వాత అపర్ణ 2002లో వివాహం చేసుకొని అమెరికా వెళ్లి ప్రసిద్ధి చెందింది. ఈమె నటించిన మొదటి సినిమానే హిట్ అవడంతో ఈమెకి మంచి పేరు దక్కింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తన భర్తతో లైఫ్ ని గడిపేస్తుంది.