మొదట మాటీవీలో ప్రసారమయ్యేటువంటి కలర్స్ ప్రోగ్రాం ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది స్వాతి రెడ్డి. ఆ తర్వాత ఈమె కలర్ స్వాతిగా పేరు మార్చుకొని పలు సినిమాలలో హీరోయిన్గా నటించింది. అలా డేంజర్, అష్టా చమ్మ, కార్తికేయ, కలవరమాయే మదిలో, స్వామి రారా తదితర చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ అందుకున్నది. ఆ తరువాత 2018 లో వికాస్ వాసు అనే అబ్బాయిని ప్రేమించి మరి వివాహం చేసుకుంది స్వాతి రెడ్డి.. వీరి వైవాహిక బంధం చాలా సజావుగాని సాగుతున్న సమయంలో సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలుపెట్టింది.
గతంలో తన భర్త నుంచి విడిపోతున్నట్లు ఎన్నో రూమర్స్ కూడా వినిపించాయి.. మీడియాలో ఈ ప్రశ్నలు అడగడంతో వాటన్నిటిని తిప్పి కొట్టింది. ఇదంతా ఇలా ఉండగా రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో స్వాతి రెడ్డి పాల్గొని పలు విషయాలను తెలియజేయడం జరిగింది.. తాను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో డేంజర్ అనే సినిమాలో నటించిన సమయంలో అల్లరి నరేష్ తన దగ్గరికి చాలా హడావిడిగా పరిగెత్తుకుంటూ వచ్చి స్వాతి ని సీక్రెట్ వీడియో ఫోన్లో ఎస్ఎంఎస్ రూపంలో వైరల్ గా మారుతోంది..ఒకసారి చూడు అంటూ తనకి చూపించారట.
దీంతో ఆ వీడియో చూసి తాను చాలా బాధపడిపోయానని మనసులు ఇంతగా దిగజారిపోయారా.. ఏంటి మరి ఇంత నీచంగా అంటూ భావించి ఇండస్ట్రీకి దూరం కావాలని డిసైడ్ అయ్యిందట. కానీ ఆ సమయంలోనే తన స్నేహితులు అందరూ కలిసి ధైర్యం చెప్పి ఇలాంటివి పట్టించుకోవద్దు.. అంటూ ధైర్యం చెప్పి తనకు అండగా నిలబడ్డారని తెలిపింది.. కానీ ఈ వీడియోతో తాను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలుపుతోంది. అలా కొన్నేళ్లపాటు ఇండస్ట్రీకి దూరం కావాల్సి వచ్చిందని తెలిపింది కలర్స్ స్వాతి. ప్రస్తుతం కలర్స్ స్వాతి చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.