పెళ్లిపై స్పందించిన సాయి ధరమ్ తేజ్… మామూలు రిప్లై ఇవ్వలేదుగా…!!

రీసెంట్‌గానే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వివాహం ఎంత అంగరంగ వైభోగంగా జరిగిందో మనందరికీ తెలిసిందే. ఈ హీరో గత కొద్దికాలంగా నటి లావణ్య త్రిపాఠి తో ప్రేమలో ఉండి.. ఇటీవలే పెద్దల్ని ఒప్పించి వివాహం చేసుకున్నారు. ఇక వీరి వివాహం జరగడంతో మెగా ఫ్యామిలీలో ఇంకా సింగిల్ గా ఉన్నటువంటి తదుపరి హీరో సాయి ధరమ్ తేజ్ పై పెళ్లి ఒత్తిడి పడుతున్నట్లు సమాచారం.

తేజ్ సోషల్ మీడియా వేదికగా వరుణ్ పెళ్లికి సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేసి…” ఎందుకు, వై, క్యో, ఎన్? ఎంత పని చేసావు రా వరుణ్ బాబు.. నీకు పెళ్లి సంబరాలు.. నాకు స్వతంత్ర పోరాటం ” అంటూ ఫన్నీ పోస్ట్ పెట్టాడు. స్వాతంత్ర పోరాటం అంటే తేజ్ సింగిల్ గా ఉండేందుకు పోరాడుతున్న అని పరోక్షంగా ఈ పోస్ట్ ద్వారా తెలియజేశాడు. ఈ పోస్ట్ చూస్తే.. ఇంట్లో కూడా పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తుంది.

తాజాగా సాయి ధరమ్ తేజ్ #AskSDT పేరుతో తన ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేశాడు. ఈ క్రమంలో ఓ యూజర్… బ్రో మీ పెళ్లెప్పుడు? అని ప్రశ్నించగా.. దానికి తేజ్ సమాధానమిస్తూ..” నీకు అయిన వెంటనే నేను చేసుకుంటాను ” అని సేఫ్ గా బదులు ఇచ్చాడు. మరో యూజర్ ” చిన్న మావయ్యతో సినిమా అయిపోయింది? మరి పెద్ద మావయ్యతో కలిసి ఎప్పుడు నటిస్తారు? అని అడగగా…” ఆ ఛాన్స్ కోసమే నేను వెయిట్ చేస్తున్న ” అంటూ రిప్లై ఇచ్చాడు సాయి ధరమ్ తేజ్. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.