కోపం ఎక్కువగా ఉంటుందా?… ఎంత తగ్గించుకుందాం అన్న తగ్గడం లేదా..? అయితే ఇలా ఈజీగా చిటికలో మాయం చేసుకోవచ్చు…!!

కొంతమందికి కోపం చాలా ఎక్కువగా ఉంటుంది. దానిని కంట్రోల్ చేసుకోవడానికి వివిధ ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. ఎన్ని చేసిన ఎటువంటి ఫలితం కూడా కొంతమందికి కలగదు. కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఇప్పుడు చెప్పేవి బాగా హెల్ప్ అవుతాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

ఒత్తిడి తగ్గాలన్న కోపం తగ్గాలన్న కొంచెం సేపు ఫ్రెష్ గాలిలో తిరిగితే మైండ్ బాగా పనిచేస్తుంది. ప్రశాంతంగా మైండ్ మారుతుంది. ఎప్పుడైనా టెన్షన్ ఎక్కువ ఉన్న.. ఒత్తిడి, కోపం లాంటివి ఉన్న కొంచెం సేపు నవ్వడం ఫన్నీగా ఉండడం అలవాటు చేసుకుంటే కోపం చిటికలో తగ్గిపోతుంది.

అంతేకాదు మంచి మంచి పాటలు వింటే కూడా కోపం తగ్గుతుంది. మీ కోపానికి కారణం మీ డైలీ రొటీన్ అవ్వచ్చు. కాబట్టి దానిలో కొంచెం మార్పులు చేర్పులు చేసుకోవడం ముఖ్యం. కొన్ని కొన్ని సార్లు కోపం విపరీతంగా పెరిగిపోతుంది. అలాంటప్పుడు టేక్ ఇట్ ఈజీ.. అని స్పోర్టివ్ గా తీసుకుంటే కోపం చిటికలో తగ్గిపోతుంది. ఈ చిట్కాలు పాటించి మీ కోపాన్ని చిటికలో తగ్గించుకోండి.