పవన్ కళ్యాణ్ – హరికృష్ణ కాంబోలో మిస్సయిన సినిమా ఏంటో తెలుసా..?

మెగా – నందమూరి హీరోల మధ్యన సినిమాల విషయంలో గట్టి పోటీ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. వారికి తగ్గట్టుగా ఫాన్స్ మధ్యన కూడా వార్‌ జరుగుతూ ఉంటుంది. అయితే ఈ కుటుంబాల హీరోలు సినిమాల విషయంలో ఎంత పోటీ పడ్డ బయట మాత్రం చాలా సన్నిహితంగా ఉంటారు అన్న సంగతి తెలిసిందే. గతంలో చిరంజీవి, బాలకృష్ణ కూడా అదే విధంగా మంచి స్నేహితులుగా ఉండేవారు. ఇప్పుడు ఎన్టీఆర్ – రామ్ చరణ్ మధ్య కూడా మంచి బాండింగ్ ఉంది. గతంలో చిరు, బాలయ్య కాంబినేషన్లో సినిమా రూపొందించాల్సి ఉండగా ఏవో కారణాలతో ఆ సినిమా ఆగిపోయిన ఈ తరం హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్లో ఆర్‌ఆర్ఆర్ సినిమా తెరకెక్కి ఆస్కార్ అవార్డును అందుకుంది.

ఇక గతంలో నందమూరి హీరో హరికృష్ణ, మెగా హీరో అయిన పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కించాలని భావించారట ప్రముఖ డైరెక్టర్ వైవిఎస్ చౌదరి. సీతారామరాజు మూవీ లాంటి మరో కథను తయారు చేసి హరికృష్ణ ను అన్నయ్యగా పవన్ కళ్యాణ్ ని తమ్మునిగా ఓ అద్భుతమైన కథను రాసుకున్నాడట. ఇద్దరు ఆ సినిమా చేయడానికి ఆసక్తి చూపారట. హరికృష్ణ డేట్స్ కూడా ఇచ్చేసాడట. కానీ పవన్ కళ్యాణ్ నుండి డేట్స్ విషయంలో క్లారిటీ రాక‌పోవడంతో ఈ సినిమాను సట్స్ పైకి తీసుకురాలేదు. అయితే వైవిఎస్ చౌదరి ఎప్పటికైనా వీరిద్దరి కాంబినేషన్లో ఆ సినిమాను తీయాలని పట్టు పట్టాడట. కానీ దురదృష్టవశాత్తు హరికృష్ణ గారు మరణించారు.

ప్రస్తుతం వైవిఎస్ చౌదరి ఇదే కథను మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ కాంబోలో తీస్తే బాగుంటుందని భావిస్తున్నారట. రీసెంట్ గా జరిగిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు. చిరంజీవి మరియు పవన్ ను ఒప్పించి ఎలాగైనా ఈ సినిమాను రూపొందించాలని ఆయన వివరించాడు. కానీ ప్రస్తుతం వైవిఆర్ చౌదరి ప్లాపులతో ఉన్నారు. దీంతో భారీ బడ్జెట్లో సినిమాకు వైవిఎస్ చౌదరికి నిర్మాతలు ఎవరు దొరకరు. బొమ్మరిల్లు ఆర్ట్స్ పై గతంలో ఆయనే తన సినిమాలను ప్రొడ్యూస్ చేసుకునేవాడు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితుల్లో వైవిఎస్ కూడా లేరు. ఇక వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుందో లేదో చూడాలి.