నాని-శ్రీలీల కాంబోలో మిస్ అయిన సినిమా ఇదే.. కుదురుంటే మరో 100 కోట్లు పక్కా..!!

సినిమా ఇండస్ట్రీలో బోలెడు మంది హీరోలు ఉన్నారు ..హీరోయిన్స్ ఉన్నారు.. కానీ కొందరికి కొందరికే సెట్ అవుతూ ఉంటారు . ఒకప్పుడు ఎన్టీఆర్ – సావిత్రి.. ఏఎన్నార్ – సావిత్రి.. నాగార్జున -శ్రీదేవి ఎలా సెట్ అయ్యారో.. అలాంటి కాంబో కోసం వెయిట్ చేస్తున్నారు అభిమానులు. అలాంటి జంట రిపీట్ అయితే చూడాలి అంటూ ఫ్యాన్స్ తెగ కోరుకుంటున్నారు . కానీ అలాంటి జంటలు సెట్ అయినట్టే సెట్ అయ్యి లాస్ట్ మూమెంట్లో క్యాన్సల్ అయిపోతున్నాయి.

ఆలిస్టులోకే వస్తారు అందాల బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రీ లీల హ్యాండ్సం హీరో నాచురల్ స్టార్ నాని. వీళ్లిద్దరి కాంబోలో ఓ సినిమా రావాల్సి ఉండింది. అంత సెట్ అయ్యి లాస్ట్ మూమెంట్లో ఈ సినిమా రిజెక్ట్ అయింది . ఆ సినిమా మరేదో కాదు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన దసరా . నాని కెరియర్ లోనే 100 కోట్లు క్రాస్ చేసిన మూవీగా. ఈ సినిమా రికార్డు నెలకొల్పింది .

అంతేకాదు .. ఈ సినిమా కోసం శ్రీకాంత్ ఓదెల బాగా కష్టపడ్డాడు .. నాని ఫుల్ టు ఫుల్ మాస్ లుక్ లో కనిపించారు . ఈ సినిమాలో కీర్తి సురేష్ నటించిన వెన్నెల పాత్ర కోసం ముందుగా శ్రీలీలను అనుకున్నారట . కానీ శ్రీ లీల ఫుల్ బిజీబిజీగా ఉండడంతో కాల్ షీట్స్ అడ్జస్ట్ చేయలేక .. ఈ ఆఫర్ ను వదిలేసుకుంది . అది కాస్త కీర్తి సురేష్ ఖాతాలో పడి సూపర్ డూపర్ హిట్ అందుకుంది . అలా నాని శ్రీలీల కాంబోలో సినిమా మిస్ అయింది అనమాట..!!